అసలు షూటింగే స్టార్ట్ కాలేదు మరి ఓటీటీ రైట్స్ కోసం భారీ పోటీ ఏంటని అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు విషయమంతా. పాన్ ఇండియా వ్యాప్తంగా సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. అందుకే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లకుముందే భారీ డిమాండ్ నెలకొంది. ఈ సినిమా ఫస్టు పార్టు స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో వారు తీసుకున్నారు. ఈ సినిమా స్ట్రీమింగ్ తో సబ్ స్క్రైబర్స్ బేస్ అమెజాన్ కు పెరిగింది. ఎక్కువ వ్యూస్ హావర్స్ తో పుష్ప అమెజాన్ లో రికార్డు క్రియేట్ చేసింది. దాంతో సెకండ్ పార్టు స్ట్రీమింగ్ రైట్స్ ను కూడా వారే సొంతం చేసుకోవాలని భావిస్తున్నారట.

అయితే అంతకంటే ఎక్కువ మొత్తం ఆఫర్ చేస్తూ మిగతా ఓటీటీ సంస్థలు పోటీపడుతున్నాయట. జీ5తో పాటు netflix, సోనీ లివ్, డిస్నీ హాట్ స్టార్ లు ఈ సినిమా హక్కుల కోసం పోటీ పడుతున్నాయట. ఆయా సంస్థల పోటీ చూస్తుంటే డిజిటల్ హక్కుల రూపంలోనే చిత్ర యూనిట్ కు టేబుల్ ప్రాఫిట్ వచ్చేలా కనబడుతోంది. అందువలన డిజిటల్ రైట్స్ విషయంలోను ఈ సినిమా కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని అంటున్నారు. కరోనా నిబంధనలతో మొదటి పార్ట్ ను చాలా తక్కువ బడ్జెట్, తక్కువ లొకేషన్స్ లోనే చిత్రీకరించారు. కానీ పరిస్థితులు సర్దుకోవడంతో సెకండ్ పార్ట్ ను లావిష్ గా చిత్రీకరించాలని ప్లాన్ చేశారు.

ఈ సినిమా మేకింగ్ ఖర్చులకు గాను చిత్ర యూనిట్ 350 నుంచి 400 కోట్ల బడ్జెట్ వరకూ కేటాయించింది. ఈ సినిమాకు వెయ్యి కోట్ల వరకూ వసూళ్లను టార్గెట్ గా పెట్టుకున్నట్టు వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. ఈ సినిమాను మారేడుమిల్లి ఫారెస్టు తో పాటు కొంత భాగాన్ని ఫారిన్ లోను తీయనున్నట్టుగా సమాచారం. మనోజ్ బాజ్ పాయ్ .. విజయ్ సేతుపతి .. ప్రియమణి పేర్లతో పాటు సమంత పేరు కొత్తగా వినిపిస్తోంది. ఇక పాటల పరంగా కూడా అంతకుమించి ఉండేలా దేవి శ్రీ ప్రసాద్ ట్యూన్ చేస్తున్నారట. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ ఇద్దరూ కూడా ‘పుష్ప 2’ సినిమా కోసం సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఆగష్టు 31న స్టార్ట్ చేసి వచ్చే ఏడాది సమ్మర్ కు విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *