మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ భీమ్లా నాయక్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో రానాకు జోడిగా ఆమె నటించారు. ఆ సినిమా సంయుక్తకు ఎంత పేరు తెచ్చిపెట్టిందన్న విషయాన్ని ప్రక్కనబెడితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆమె ఇచ్చిన స్పీచ్ మాత్రం హైలైట్ గా నిలిచింది. ఆ ఈవెంట్ లో త్రివిక్రమ్ ను తన గురువు అంటూ ప్రకటించిన సంయుక్త గురూజీ ద్రుష్టిలో పడింది. ఆ తరువాత ఆమె ‘సార్’ అనే సినిమా అవకాశం దక్కించుకుంది. సంయుక్త ఈ అవకాశం దక్కించుకోవడం వెనుక త్రివిక్రమ్ ఉన్నారంటూ వార్తలు ప్రచారం జరిగాయి.

తమిళ స్టార్ హీరో ధనుష్ తెలుగులో డైరెక్ట్ గా చేస్తున్న చిత్రం సార్. ‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. తమిళంలో ఈ సినిమాకి ‘వాతి’ అనే టైటిల్ ను ఖరారు చేశారు.ఈ సినిమా నుంచి ఈ నెల 27వ తేదీన ఫస్టులుక్ ను .. 28వ తేదీన టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు చెప్పారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. సాయికుమార్ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్న ఈ సినిమాకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.బై లింగ్వల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా సంయుక్తను తీసుకోవడం వెనుక త్రివిక్రమ్ ఉన్నారంటూ టాక్ నడుస్తోంది.

ఇదే సమయంలో మహేష్28వ మూవీలో కూడా సంయుక్త అవకాశం దక్కించుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా సంయుక్త నటిస్తున్నారని ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన ఆమె అందులో ఎటువంటి నిజం లేదని తేల్చేశారు. మహేష్ 28వ సినిమాలో నేను లేను. నిజానికి ఇలాంటి రూమర్ రాయాలంటే చాలా క్రియేటివి కావాలి. ఇలాంటి రూమర్ ఎలా పుట్టిస్తారో తెలీదు కానీ వారి క్రియేటివ్ ని మెచ్చుకోవాల్సిందే. ఒకప్పుడు రూమర్ విని భయం వేసేది. ఇప్పుడు మాత్రం రూమర్స్ ని ఎంజాయ్ చేయడం నేర్చుకున్నా అంటూ సంయుక్త మీనన్ క్లారిటీ ఇచ్చారు. మహేష్ 28వ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహన్ అవకాశం దక్కించుకున్న సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *