డైరెక్టర్ మారుతి గురించి ప్రత్యేకించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. చిన్న బడ్జెట్ సినిమాలని పెద్ద హీట్స్ చేసే డైరెక్టర్స్ లో మారుతి ముందుంటాడు. అయితే, రీసంట్ గా వచ్చిన పక్కా కమర్షియల్ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత కలక్షన్స్ ని సాధించలేకపోయింది. మెగాస్టార్ చిరంజీవి సైతం కదిలి సినిమాకి హైప్ తీస్కుని వచ్చినా ఫలితం లేకుండా పోయింది. అయితే, మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాని ప్రమోట్ చేయడంలో విషయం ఉందని చెప్తున్నారు టాలీవుడ్ తమ్ముళ్లు. ఏంటంటే, మెగాస్టార్ చిరంజీవి తర్వాత డైరెక్టర్ మారుతితో సినిమా చేసేందుకు కమిట్ అయ్యాడని టాక్. అందుకే, పక్కా కమర్షియల్ సినిమా ప్రమోషన్స్ కి వచ్చాడని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఇదే నిజమే అని అనిపిస్తోంది. ఎందుకంటే, ‘పక్కా కమర్షియల్’ సినిమా విడుదల సమయంలో మెగాస్టార్.. మారుతితో సినిమా గురించి మాట్లాడారు. యువి క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమా చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ డిలే అయ్యేలా కనిపిస్తుంది. రామ్ చరణ్ హీరోగా గౌతమ్ తిన్ననూరి ఓ సినిమా కమిట్ అయిన సంగతి తెలిసిందే. దీన్ని యువి క్రియేషన్స్ సంస్థ నిర్మించబోతోంది.
యువి బ్యానర్ లో ఎలాగూ చరణ్ ఒక సినిమా చేస్తున్నారు కాబట్టి మళ్లీ వెంటనే తను కూడా అదే సంస్థకు సినిమా చేసే ఆలోచనలో మెగాస్టార్ లేరని ఒక టాక్ వస్తోంది. కానీ, మారుతి లాంటి డైరెక్టర్స్ స్టార్ హీరోస్ ని డీల్ చేయగలడా లేదా అనే సందేహం కూడా ఉందని మరో టాక్. మారుతి అద్భుతమైన కథతో వస్తేనే కానీ, సినిమాకి కమిట్ అయ్యేలా కనిపించడం లేదట. అంతేకాదు, మరోవైపు ప్రభాస్ తో చేయాల్సిన మారుతి సినిమా కూడా వాయిదా పడే అవకాశమే కనిపిస్తోంది. ఇప్పటికే ప్రభాస్ ప్యాన్ ఇండియా రేంజ్ లో చాలా సినిమాలు కమిట్ అయ్యాడు. ఇప్పుడు మారుతి సినిమా ఆ రేంజ్ లో ఉంటేనే కానీ, ఒప్పుకునే స్టేజ్ లో లేడని చెప్తున్నారు. అంతేకాదు, మరోవైపు మారుతి పెద్ద హీరోలని డీల్ చేయగలడా లేదా అనేది చాలామంది సినీ పండితులు అభిప్రాయం. ఈ సమయంలో ప్రభాస్ మారుతి కాంబినేషన్, అలాగే- మారుతి చిరంజీవిల కాంబినేషన్ ఉంటుందా లేదా అనేది సస్పెన్స్ గానే కనిపిస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చేతిలో ఉన్న మూడు సినిమాలు పూర్తి చేసే వరకు మరే సినిమా అంగీకరించకూడదని అనుకుంటున్నట్లుగా టాక్. ఈ మూడు సినిమాలు విడుదల కావాలంటే వచ్చే ఏడాది వరకు ఎదురుచూడాలి. ఈలోగా మారుతికి మంచి కథ సెట్ అయితే ఓకే.. లేదంటే చిరు ప్రాజెక్ట్ ఉండదనే అనుకోవాలి. అయితే, ప్రభాస్ మారుతిల సినిమా మాత్రం అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తేనే కానీ చెప్పలేని పరిస్థితి. అదీ మేటర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *