బాలయ్యబాబు యాక్షన్ కి రెడీ అయిపోయాడు. అఖండ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన బాలయ్యబాబు నెక్ట్స్ మలినేని గోపీచంద్ తో హై ఓల్టేజ్ యాక్షన్ కి మరోసారి రెడీ అయిపోయాడు. రీసంట్ గా పూజాకార్యక్రమాలు జరుకున్న ఈ సినిమా షూటింగ్ కి రెడీ అయిపోయింది. తెలంగాణ ప్రాంతంలో సిరిసిల్ల ఏరియాలో షూటింగ్ ను మొదలుపెట్టారు. ఇందులో బాలయ్య పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. యాక్షన్ సీన్స్ తోనే సినిమాని ప్రారంభించబోతున్నారు.
మలినేని గోపిచంద్ క్రాక్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బాలయ్యబాబుని ఒక రేంజ్ లో చూపించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, ఇప్పుడు షూటింగ్ జరగబోయే సీన్స్ ని రామ్ లక్షణ్ మాస్టర్స్ కంపోజ్ చేస్తున్నారు. ఇక్కడే ఫస్ట్ షెడ్యూల్ ని ఫినిష్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఆ తర్వాత హైదరాబాద్ శివార్లలో ప్రత్యేకమైన సీన్స్ ని ప్లాన్ చేశారట. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ ని ఫినిష్ చేసి దసరాకి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో కూడా బాలయ్యబాబు ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. బాలయ్యబాబు డబుల్ యాక్షన్ సినిమాలన్నీ మంచి సక్సెస్ ని సాధించాయి. అంతేకాదు, బాలయ్యబాబు ఈ సినిమాకోసం కొద్దిగా వెయిట్ కూడా తగ్గబోతున్నాడట. దీనికోసం ప్రత్యేకమైన కసరత్తులు చేయబోతున్నాడు. అందుకే, ఇప్పుడు ఈసినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. క్రాక్ సినిమా తర్వాత మలినేని గోపీచంద్ చేస్తున్న సినిమా కావడం, అందులోనూ బాలయ్యబాబు మార్కెట్ హ్యూజ్ గా పెరగడం అనేది ఈ సినిమాకి ప్లస్ పాయింట్ గా మారింది. బిజినెస్ పరంగా ఢోకా లేదని, ఈ సినిమా ఒక రేంజ్ లో ఉండబోతోందని ప్యాన్స్ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా వేటపాలెంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా రాయలసీమ నేపథ్యంలో రూపొందనుందని అంటున్నారు. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. బాలకృష్ణ సరసన హీరోయిన్‌గా శృతి హాసన్‌ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ లు కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. మరి చూద్దాం బాలయ్యబాబు ఈ సినిమాతో ఏ రేంజ్ లో హిట్ కొడతాడు అనేది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *