2022 సంక్రాంతికి వచ్చి అందరి దృష్టినీ అమితంగా ఆకర్శించిన చిత్రం ‘బంగార్రాజు’. ఆరేళ్ల కిందట సంక్రాంతికే వచ్చి ఘనవిజయం సాధించిన ‘సోగ్గాడే చిన్నినాయనా’కు ఇది సీక్వెల్. దాని లాగే మంచి ఎంటర్టైనర్ లాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘బంగార్రాజు’ టాక్ తో సంబందం లేకుండా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను రాబడుతూ దూసుకెళ్తోంది. నాగార్జున, నాగ చైతన్యలు కలిసి నటించిన ఈ సినిమాలో కృతి శెట్టి, రమ్యకృష్ణ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాలోని ఎమోషన్లకు ఎంటర్టైన్మెంట్ బాగా ప్లస్ కావడంతో సంక్రాంతికి బంగార్రాజు బొమ్మ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పెద్ద బంగార్రాజుగా నాగ్ వీలైనంత మేర ప్రేక్షకులను ఎంగేజ్ చేయడం పాటలు-ఫైట్లు లాంటి అదనపు హంగులు బాగా కుదరడం, చైతూ పాత్ర ప్లస్ కావడంతో ఈ సినిమాని చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు.
క్లైమాక్సులో వచ్చే సర్ప్రైజ్ నాగ్ అభిమానులనే గాక సినీ అభిమానులను అలరించింది. పండక్కి సూటయ్యే పల్లెటూరి సినిమా కావడం.. పెద్దగా పోటీ లేకపోవడం.. నాగ్ సహా కొన్ని ఆకర్షణలు ఉండటం వల్ల ‘బంగార్రాజు’ బాక్సాఫీస్ దగ్గర మొదటి మూడు రోజుల్లోనే 27 కోట్ల షేర్ 53 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఇప్పటికే చాలా ఏరియాలలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం విశేషం. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఈ సినిమా 39 కోట్లు వసూల్ చేయవలసి ఉంది. నాలుగో రోజు కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడంతో ఈ సినిమా 30 కోట్ల షేర్ క్లబ్ లో చేరింది.
Nizam: 6.72Cr
Ceeded: 4.80Cr
UA: 3.12Cr
East: 2.76Cr
West: 1.95Cr
Guntur: 2.56Cr
Krishna: 1.23Cr
Nellore: 1.25Cr
AP-TG Total:- 25.57CR(42Cr~ Gross)
Ka+ROI: 1.72Cr
OS – 1.40Cr
Total WW: 30.29CR(60.80CR~ Gross)
నాలుగు రోజుల్లోనే ఈ సినిమా 30.29 కోట్ల షేర్ ను రాబట్టి నాగ్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 8 కోట్లు సాదించవలసి ఉంది. గ్రామీణ నేపథ్యంలో విజువల్స్ ను చక్కగా చూపిన యువరాజ్ ఛాయాగ్రహణం సినిమాకు ప్రధాన ఆకర్షణల్లో ఒకటి. పాటలు సహా అన్ని చోట్లా విజువల్స్ కలర్ ఫుల్ గా అనిపిస్తాయి. నిర్మాణ విలువలు కూడా బాగా కుదరడంతో ఈ సినిమా సంక్రాంతి విజేతగా నిలిచింది.