క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన చాలా సినిమాలు సక్సెస్ అయ్యాయి.ఈ నేపథ్యంలో క్రికెట్ ఐడల్, దేశానికి మొదటి వరల్డ్ కప్ అందించిన కపిల్ దేవ్ కోణంలో ఈ సినిమా తెరకెక్కింది. 1983లో ఇండియా తొలిసారి వరల్డ్ కప్ గెలిచిన క్రీడానేపథ్యంతో ప్రముఖ దర్శకుడు కబీర్ ఖాన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 24న విడుదలయింది. రణ్ వీర్ సింగ్ నటించిన ఈ బయోపిక్ చిత్రం మొదటి ఆట నుంచే డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. సినీ క్రిటిక్స్ ఈ సినిమాపై ప్రశంసల జల్లులు కురిపించినా ప్రేక్షకులు మాత్రం ఈ చిత్రాన్ని చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇదే విషయాన్ని కలెక్షన్స్ నిరూపించాయి. కనీసం క్రికెట్ ప్రేమికుల్ని కూడా చిత్రం ఆకట్టుకోలేకపోయింది. సినిమాకి ఓపెనింగ్స్ కూడా సరిగ్గా రాలేదు.
యూత్ ప్రేక్షకులు కూడా ఈ సినిమాని అసలు పట్టించుకోకపోవడం సినీ వర్గాలను షాక్ కు గురి చేసింది. ఈ సినిమా 19 రోజులకు 103 కోట్లు మాత్రమే వసూల్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. ఈ కలెక్షన్స్ లో 59 కోట్లు ఓవర్సీస్ లోనే రావడం విశేషం. ఈ సినిమాని మొత్తం ఆరు నిర్మాణ సంస్థలు భాగస్వామ్యంలో నిర్మించాయి. రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టగా..ఫాంటమ్ ఫిల్మ్స్ ..నడియావాలా గ్రాండ్ సన్ ఎంటర్ టైన్ మెంట్స్..వైబ్రీ మీడియా.కె.ఏ ప్రొడక్షన్స్ భాగం పంచుకున్నాయి. దీపిక-రణబీర్ నిర్మాతలుగా పెట్టుబడులు పెట్టారు. ఈ నిర్మాణ సంస్థలు పెద్ద మొత్తంలో నష్టపోయినట్లు బాలీవుడ్ మీడియా చెబుతోంది. ఈ సినిమాకి 80 కోట్లకు పైగా నష్టపోనట్లు ట్రేడ్ వర్గాలు కుడి అంచనా వేస్తున్నాయి. 80 కోట్లు నష్టపోవడంతో బాలీవుడ్ చరిత్రలోనే అత్యంత చెత్త చిత్రాల టాప్-10 చిత్రాల జాబితాలో ఈ సినిమా చేరింది.
ఈ జాబితాలో ఆర్జీవీకి ఆగ్ మొదటి స్థానంలో ఉండగా రెండవ స్థానంలో అభిషేక్ బచ్చన్ ద్రోణ సినిమా ఉంది. ఇక మూడవ స్థానంలో ఖలీన్ హమ్ జీ జాన్ సే, నాలుగవ స్థానంలో జంజీర్, ఐదవ స్థానంలో బాంబే వెల్వెట్, ఆరవ స్థానంలో మీర్జియా, 7వ స్థానంలో ఫిత్తురు, 8వ స్థానంలో రంగూన్, 9వ స్థానంలో జీరో 10వ స్థానంలో 83 ఉంది. ఇందులో అత్యధిక నష్టపోయిన చిత్రాల జాబితాలో 83 మొదటి స్థానంలో ఉంది. 1) 83 (80 cr నష్టం) 2. Bombay Velvet (70 cr నష్టం) 3. Zero (70 cr నష్టం), 4.మొహంజదారో (55 cr నష్టం) 5. జగ్గ జాసూస్ ( 50 కోట్ల నష్టం) వచ్చింది. అదే సమయంలో రిలీజ్ అయిన పుష్ప, స్పైడర్ మాన్, సూర్యవంశీ లాంటి చిత్రాలు పెద్ద సక్సెస్ అయిన సంగతి తెలిసిందే.