పుష్ప 20 రోజులు, శ్యామ్ సింగరాయ్ 13 రోజుల కలెక్షన్స్

అల్లు అర్జున్-సుకుమార్ ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘పుష్ప’పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే. ఉత్కంఠకు తెర దించుతూ ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 17న థియేటర్లలోకి దిగిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకొని సూపర్ హిట్ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఈ సినిమా అన్నీ ఏరియాలలో బ్రేక్ ఈవెన్ సాధించి పంపిణీదారులు భారీ లాభాలను తెచ్చి పెట్టింది. ఈ సినిమా 20 రోజులలో 160 కోట్ల షేర్ ని 303 కోట్ల గ్రాస్ ని వసూల్ చేయడం విశేషం. ఈ సినిమా నేడు జనవరి 7న ఓటీటీలో విడుదల కానుంది. దీంతో కలెక్షన్స్ కు భారీ రేంజ్ లో గండి పడటం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Nizam: 40.34Cr
Ceeded: 14.86Cr
UA: 7.97Cr
East: 4.81Cr
West: 3.92Cr
Guntur: 5.02Cr
Krishna: 4.16Cr
Nellore: 3.06Cr
AP-TG Total:- 84.14CR(131CR~ Gross)
Karnataka: 11.30Cr
Tamilnadu: 10.49Cr
Kerala: 5.27Cr
Hindi: 33.15Cr
ROI: 2.21Cr
OS – 14.21Cr
Total WW: 160.77CR(303CR~ Gross)

ఓటీటీ ద్వారా కూడా పుష్ప సినిమాకి 22 కోట్ల బిజినెస్ జరిగింది. పార్ట్-1తోనే 350 కోట్లకు పైగా బిజినెస్ రావడంతో పుష్ప పార్ట్-2పై కూడా ట్రేడ్ వర్గాలు భారీగానే అంచనాలు పెట్టుకున్నాయి. పుష్ప జోరు ఓ రేంజ్ లో ఉన్న సమయంలో నాచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా మంచి టాక్ తో మంచి వసూళ్లను రాబట్టడం విశేషం. ఈ సినిమా 13 రోజుల్లో 44 కోట్ల గ్రాస్ వసూల్ చేయడం విశేషం.

Nizam: 9.29Cr
Ceeded: 2.63Cr
UA: 2.13Cr
East: 1.08Cr
West: 84L
Guntur: 1.16Cr
Krishna: 95L
Nellore: 64L
AP-TG Total:- 18.72CR(31.77CR~ Gross)
Ka+ROI: 2.86Cr
OS – 3.54Cr
Total WW: 25.12CR(44CR~ Gross)

ఇక నాలుగవ వారంలో కూడా పుష్ప తెలంగాణలో 161 థియేటర్లలలో నడుస్తుండగా శ్యామ్ సింగరాయ్ 3వ వారంలో కూడా 116 థియేటర్లలలో నడుస్తోంది. అఖండ కూడా 6వ వారంలో 86 థియేటర్లలలో షోలు పడుతుండటం గమనార్హం. అఖండ 35 రోజుల్లో 72.27 కోట్ల షేర్ 127 కోట్లకు గ్రాస్ వసూల్ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *