కెరీర్ బిగినింగ్ నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన సినిమాల మధ్య గ్యాప్ లేకుండా చూసుకుంటూ వచ్చాడు. సినిమా ఫలితంతో సంబందం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ అభిమానులను అలరించాడు. 2018లో వచ్చిన అరవింద సమేత సినిమా తరువాత ఎన్టీఆర్ నుంచి ఏ సినిమా రాకపోవడంతో అభిమానులు నిరాశలో మునిగిపోయారు. ఆర్ ఆర్ ఆర్’ సినిమా కోసం దాదాపు నాలుగేళ్లకి పైగా సమయం కేటాయించవలసి రావడంతో ఈ గ్యాప్ వచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమా సంక్రాంతికి విడుదల అవుతుందనుకుంటే తీరా వాయిదా పడింది. ఈ సమయంలో ఎన్టీఆర్ కెరీర్ పీక్ దశలో నాలుగు సంవత్సరాలు వేస్ట్ చేశాడంటూ గత కొన్ని రోజులుగా వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక తదుపరి సినిమాలను చకచకా పూర్తి చేయాలనే నిర్ణయానికి ఎన్టీఆర్ వచ్చేసినట్టుగా చెబుతున్నారు.

ఆయన తన నెక్స్ట్ మూవీని కొరటాల శివతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ కొరటాల డైరెక్ట్ చేసిన ఆచార్య సినిమాలు విడుదల కాగానే ఇద్దరూ కలిసి సెట్స్ పైకి వెళదామని అనుకున్నారు. ఫిబ్రవరి మూడవ వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరపాలని ప్లాన్ చేస్తున్నారు. ‘ఆర్ ఆర్ఆర్’ సినిమా విడుదల అయిన 30 రోజుల గ్యాప్ లోనే కొరటాల-ఎన్టీఆర్ ప్రాజెక్టు విడుదల అయ్యేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఇక ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లకముందే ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు కథకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఆ సినిమాని జూన్ నెలలో స్టార్ట్ చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడట. ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్న బుచ్చిబాబు ఎన్టీఆర్ కోసం స్క్రిప్ట్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

కొరటాల, బుచ్చిబాబు సినిమాలతో బాటు ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ చెప్పిన స్టోరీ లైన్ కు ఎన్టీఆర్ ఓకె చెప్పిన సంగతి తెలిసిందే. ఆ ప్రాజెక్టుని డిసెంబర్ నెలలో ప్రారంభించి 2023 సమ్మర్ కి రిలీజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మూడు చిత్రాలతో బాటు ఎన్టీఆర్‌ బాలీవుడ్‌ బడా దర్శకుడితో సినిమా చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్‌ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పౌరాణిక అంశాలతో కూడిన పీరియాడికల్‌ బ్యాక్‌డ్రాప్‌ స్క్రిప్ట్‌ను సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌పై ఎన్టీఆర్‌ కూడా ఆసక్తిగా ఉన్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. అంతేగాక దీనికి ‘జై బావ్ రే’ అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నారట. ఆ సినిమాని వచ్చే ఏడాది జూన్ నుంచి సెట్స్ మీదకు తీసుకువెళ్లనున్నారనే టాక్ నడుస్తోంది.ఎన్టీఆర్ వరుసగా నాలుగు చిత్రాలను చేస్తుండటం అభిమానులలో జోష్ నింపింది

మొత్తానికి అది మ్యాటర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *