ఫస్ట్ టైమ్ ప్రభాస్ పోలీస్ గెటప్ లో కనిపించబోతున్నాడా అంటే అవుననే సమాచారం వినిపిస్తోంది. మేటర్ లోకి డైరెక్ట్ గా వెళితే, సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేయబోతున్న స్పిరిట్ మూవీలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ గెటప్ లో కనిపించబోతున్నాడట. అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ రెడ్డి వంగా పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్ ని ప్రభాస్ కోసమే వినిపించాడని, ఇది ప్యాన్ ఇండియా రేంజ్ లో బాగా కనెక్ట్ అవుతుందని అంటున్నారు. అంతేకాదు, మెంటల్ పోలీస్ గా అర్జున్ రెడ్డి కంటే పవర్ ఫుల్ పాత్రలో ప్రభాస్ ని చూడబోతున్నామని సమాచారం. ఈ న్యూస్ తెలిసినప్పటి నుంచీ ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ పండగ చేసుకుంటున్నారు.
నిజానికి మాస్ సినిమాలతో ప్రభాస్ ఇంతవరకూ ప్రేక్షకులని అలరించాడు కానీ, ఎప్పుడూ పోలీస్ గెటప్ లో కనిపించలేదు. ఇదే న్యూస్ నిజమైతే ఫస్ట్ టైమ్ పోలీస్ గా వెండితెరపై కనిపించబోతున్నాడు రెబల్ స్టార్. నిజానికి ఏక్ నిరంజన్ సినిమాలో పోలీస్ గెటప్ వేయాల్సింది. కానీ, పోలీస్ ఇన్ఫార్మర్ గా మాత్రమే కనిపించాడు ప్రభాస్. ఆ సినిమా యావరేజ్ గా పాసైపోయింది. రీసంట్ గా రాధేశ్యామ్ టీమ్ నుంచీ ఎలాంటి అప్డేట్ లేదు కాబట్టి, రాధేశ్యామ్ సినిమా ఖచ్చితంగా సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచనలోనే ఉంది మూవీ టీమ్. ఈ సినిమా తర్వాత ఆదిపురుష్ సెట్స్ లో పాల్గొంటున్నాడు ప్రబాస్. ఒకవైపు సలార్ మూవీ షూటింగ్ చేస్తూనే ఈ చారిత్రాత్మకమైన సినిమాని ఫినిష్ చేసేస్తున్నాడు. అంతేకాదు, నాగ్ అశ్విన్ సినిమా కూడా రెడీ అయిపోతోంది. ఈ సినిమాతో పాటుగా సందీప్ రెడ్డి వంగాతో జాయిన్ అవుతాడు. స్పిరిట్ అనే టైటిల్ తో ఈ సినిమా త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కాబోతోంది.
అయితే, ఈ సినిమాలో పోలీస్ గా కనిపిస్తున్నాడనే అప్డేట్ మాత్రం ఆదిపురుష్ టీమ్ నుంచీ వినిపిస్తోంది. ఈ విషయాన్ని ఆదిపురుష్‌ ప్రొడ్యూసర్‌ భూషణ్‌ కుమార్‌ తాజా ఇంటర్వ్యూలో చెప్పినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకూ ప్రభాస్‌ పోలీసు పాత్రలో నటించలేదు. కానీ అభిమానులు మాత్రం ఆ రోల్‌లో తమ డార్లింగ్‌ను చూసుకోవాలని ఎప్పటినుంచో ఆరాటపడుతున్నారు. ఒకవేళ భూషణ్‌ కుమార్‌ చెప్పిందే జరిగితే ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు పండగనే చెప్పాలి.
నిజానికి ఏ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఆ చిత్రయూనిట్ నుంచీ వస్తుంది.. కానీ, ఇప్పుడు వేరే మూవీ టీమ్ నుంచీ ఇలాంటి అప్డేట్ రావడం అనేది ఇదే ఫస్ట్ టైమ్ అని అంటున్నారు. అందులోనూ హీరో కాకుండా ఇలా వేరేవాళ్లు రివీల్ చేయడం అనేది ఫస్ట్ టైమ్. మొత్తానికి ఇదే అప్డేట్ నిజమైతే మాత్రం ఫస్్ టైమ్ సిల్వర్ స్క్రీన్ పైన ప్రభాస్ ని పోలీస్ గెటప్ లో చూస్తామన్నమాట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *