ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ గా చేసిన ఘనత సుకుమార్ కే దక్కుతోంది. అల్లు అర్జున్-సుకుమార్ ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘పుష్ప’పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే. బన్నీ కెరియర్ లోనే తొలిసారిగా రూపొందిన పాన్ ఇండియా చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గత ఏడాది డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి ఆటతోనే డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో నార్త్ ఇండియాలో డిజాస్టర్ అంటూ మొదటి రోజు కలెక్షన్స్ చూసి ట్రేడ్ వర్గాలు కూడా చెప్పడంతో సినిమా ఫలితంపై అనుమానాలు నెలకొన్నాయి. కానీ రెండవ రోజు నుంచి ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడం విశేషం. హిందీలో 50 కోట్లకు పైగా వసూల్ చేసిన ఈ సినిమా అక్కడ టాప్-5 స్థానంలో నిలిచింది.
ఇక కేరళ రాష్ట్రంలో 11 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో బాహుబలి సిరీస్ తరువాత అత్యధిక వసూల్ చేసిన చిత్రంగా పుష్ప నిలిచింది. కేరళలో టాప్ 10 తెలుగు చిత్రాల జాబితాను పరిశీలిస్తే
1)Baahubali2- 75C
2) Baahubali- 14.2C
3) Pushpa – 11Cr+***
4)Sarrainodu- 7.2C
5) NaaPeruSurya- 5.02C
6) JanathaGarage- 4.6C
7)Rudramadevi- 4.4C
8)Saaho- 4Cr
9)AlaVaikunthaPurramuloo – 3.2Cr
10) RaceGurram- 2.6C
పుష్ప సినిమా 3వ స్థానంలో నిలిచింది. ఈ సినిమా త్వరలోనే బాహుబలి-1 రికార్డును బ్రేక్ చేసి రెండవ స్థానానికి చేరుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కేరళలో రికార్డు నెలకొల్పిన ఈ సినిమా తమిళనాడులోనూ 25 కోట్ల గ్రాస్ తో నయా రికార్డు నెలకొల్పింది. ఈ జాబితాలో పుష్ప నాలుగవ స్థానంలో నిలవడం విశేషం.
1) Baahubali2 – 153.5Cr
2) Baahubali – 76Cr~
3) Oopiri: 27.15Cr
4) Pushpa – 25.15Cr****
5) SPYder: 25cr
6) Eega: 24.4Cr
7) magadheera: 18-20cr
8) Saaho: 12.1cr
9) Arundhati: 11.2cr
ఇక 16 రోజుల తరువాత కూడా తెలుగులో అత్యధిక కలెక్షన్స్ వసూల్ చేసిన చిత్రాల జాబితాలో పుష్ప 2వ స్థానంలో ఉండటం విశేషం.
1) Baahubali2 – 3.50Cr
2) Pushpa – 2.23Cr***
3) Sarileru Neekevvaru – 2.07Cr
4) Rangasthalam – 1.78Cr
5) AlaVaikunthaPurramuloo – 1.69Cr
6) Baahubali1 – 1.67Cr
పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజైనా పుష్ప సినిమాతో రికార్డు క్రియేట్ చేయడంతో బన్నీని న్యూ పాన్ ఇండియా స్టార్ అంటూ ట్రేడ్ వర్గాలు పిలుస్తున్నాయి. బాహుబలి సిరీస్ తో ప్రభాస్, పుష్ప మొదటి పార్ట్ తోనే బన్నీ పాన్ ఇండియా స్టార్ గా మారడంటూ సినీ వర్గాలలో కూడా చర్చ జరగడం గమనార్హం.
మొత్తానికి అది మ్యాటర్