అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. అది అలా ఉంటే ఈ సినిమా నుంచి కొంత బోల్డ్‌గా ఉన్న ఓ సీన్‌ను టీమ్ తొలగించనున్నదని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే… ఈ సినిమాలోని సెకండాఫ్‌లో పుష్ప తన వ్యాన్‌లో కూర్చొని శ్రీవల్లి భుజంపై చేయి వేసి ఫోన్ మాట్లాడతాడు. ఇక ఆ తర్వాత పుష్ప తన చేతిని శ్రీవల్లి ప్రైవేట్ పార్ట్స్‌పై వేసినట్టుగా ఓ సీన్ ఉంటుంది. ఈ సీన్ థియేటర్‌లో చూస్తున్న ఫ్యామిలీ ఆడియన్స్‌కి కాస్త ఇబ్బందిగా అనిపించినట్టు ఫీడ్ బ్యాక్ రావడంతో ఆ సీన్‌ను టీమ్ తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీన్ రేపటి నుంచి అంటే ఆదివారం నుంచి సినిమాలో ఉండదని సమాచారం. ఇక పుష్ప కలెక్షన్స్ విషయానికి వస్తే.. సినిమా నైజాంలో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది. ఇక మరోవైపు హిందీలో కూడా మంచి వసూళ్లు రాబట్టింది. పుష్ప హిందీ వెర్షన్ కి మొదటి రోజు 3.1 కోట్లు వసూలు అయ్యాయి. సరైన ప్రమోషన్స్ లేకుండా కూడా ఈ ఫిగర్ రావడం నిజంగా గ్రేట్ అని అంటున్నారు సినీ పండితులు. పుష్ప హిందీలో వెయ్యి లోపు స్క్రీన్స్ లోనే ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఈ మొత్తం సాధించడం గొప్ప విషయం అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *