కొలువుదీరిన హైదరాబాద్ బుక్‌ఫెయిర్
ఈ నెల 28వ తేదీ వరకు ప్రదర్శన
జాతీయ, అంతర్జాతీయ ప్రచురణ సంస్థలతో 260 స్టాళ్లు..
2.5 లక్షల పుస్తకాలు
పుస్తకాల పండుగ మళ్లీ వచ్చేసింది. ఏటేటా చదువరుల మనసు దోచుకుంటూ కొలువుదీరే 34వ జాతీయ పుస్తకమహోత్సవం శనివారం ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభమైంది. సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరు గౌరీశంకర్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, హైదరాబాద్ బుక్ ఫెయిర్ కమిటీ కార్యదర్శి కోయ చంద్రమోహన్, తదితరులు ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.