హైదరాబాద్: ఫిల్మ్ ఛాంబర్‌లో వివిఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న నూతన చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగోను ప్రముఖ సినీ ప్రముఖుల చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు. శ్రీరంగం సతీష్ కుమార్ సమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు నానిరాజ్ చెప్పిన వినూత్న కథాంశం నచ్చి, గతంలో తెలుగు, తమిళం, కన్నడ చిత్రాలకు దర్శక–నిర్మాతగా వ్యవహరించిన అనుభవంతో ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ కార్యక్రమానికి తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు & తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఉపాధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర బృందాన్ని అభినందించారు.
దర్శకుడు నానిరాజ్ గత 9 సంవత్సరాలుగా అసిస్టెంట్ డైరెక్టర్‌గా, రచయితగా, పలు చిత్రాలకు ఘోస్ట్ రైటర్‌గా సేవలందించారు. అనేక షార్ట్ ఫిల్మ్స్‌ను కూడా రూపొందించిన ఆయన, ఈ చిత్రాన్ని కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైన్‌ర్‌గా మలుస్తున్నారు. కథలో కొత్తదనం, వినోదం సమపాళ్లలో ఉండేలా రూపొందిస్తున్న ఈ చిత్రానికి ఆయనే సంగీత దర్శకుడిగా వ్యవహరించడం విశేషం.
మార్చి మొదటి వారం నుంచి షూటింగ్ ప్రారంభించి, ఏప్రిల్–మే–జూన్ నెలలలో ప్రధాన షెడ్యూల్స్ పూర్తి చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.
ఈ చిత్రంతో ప్రతిభావంతులైన కొత్త హీరో, హీరోయిన్లను పరిచయం చేయనున్నారు. అన్వేష్, సిరి, శ్రీదేవి, సుమన్, జీవా, అజయ్ ఘోష్, ఎల్‌బి శ్రీరామ్, చిత్రమ్ శ్రీను, చత్రపతి శేఖర్, జబర్దస్త్ అప్పారావు, షేకింగ్ శేషు, రవి కుమార్, శ్రీకాంత్, హరీష్, రాజు, జి. నారాయణరావు, సైనిక, హర్షవర్ధిని, మమత, స్నేహ, జగదీశ్వరి, ధనలక్ష్మి రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
సురేష్ ఆత్రేయ డిఓపీగా, శ్రీను ఎడిటర్‌గా, రాక్ నాని, మున్నా కొరియోగ్రాఫర్లుగా, దేవరాజ్ ఫైట్ మాస్టర్‌గా పని చేస్తున్నారు. త్వరలోనే చిత్రానికి సంబంధించిన ఇతర విశేషాలను చిత్ర బృందం వెల్లడించనుంది.
యువతను ఆకట్టుకునే వినోదాత్మక కథతో రాబోతున్న ఈ చిత్రం పరిశ్రమలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
నటీనటులు : అన్వేష్, సిరి, శ్రీదేవి, సుమన్, జీవా, అజయ్ఘోష్, ,LB శ్రీరామ్, చిత్రమ్ శ్రీను, చత్రపతి శేఖర్, జబర్దాష్ అప్పారావు, షేకింగ్ శేషు,రవి కుమార్, శ్రీకాంత్, హరీష్, రాజు, G నారాయణ రావు, సైనిక, హర్ష వర్దిని, మమత, స్నేహ, జగదీశ్వరి, ధనలక్ష్మి రెడ్డి తదితరులు.
సాంకేతిక నిపుణులు :
సంగీతం, రచన & దర్శకత్వం : నానిరాజ్
సహ నిర్మాతలు : మహాధన్, తురన్యు త్రిలోచన్
నిర్మాత: నాగరాజు గొల్లపల్లి
సమర్పకులు : శ్రీరంగం సతీష్‌కుమార్
DOP : సురేష్ ఆత్రేయ
ఎడిటర్ : శ్రీను
కొరియోగ్రఫీ : రాక్ నాని, మున్నా
ఫైట్స్ : దేవరాజ్
మేకప్ : వినోద్
ఆర్ట్ డైరెక్టర్ : విజయ్ కృష్ణ
కాస్ట్యూమ్స్ : తిరుమల
స్టిల్స్ : రాజా, పోస్టర్
డిజైన్స్ : కోడి
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : బాలరాజు
కో-డైరెక్టర్ : C.V రావు
అసోసియేట్ డైరెక్టర్లు : సాయి కుమార్, వంశీ
విఎఫ్ఎక్స్ : జెమిని

