సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చురుకుగా జరుగుతున్నాయి. వచ్చేనెల 2వ వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. 12 ఏళ్ల విరామం తరువాత మహేష్ – త్రివిక్రమ్ ల కలయికలో రాబోతున్న సినిమా కావడంతో సహజంగానే ఈ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. సర్కారు వారి పాట ఆశించిన మేరకు విజయాన్ని సాదించకపోవడంతో ఈ సినిమాపై అభిమానులు గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చాలా స్పెషల్ అంశాలు ఉండనున్నాయని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప్రకటించింది. దాంతో ఏమిటా అంశాలు? అనే ఆసక్తి అభిమానులలో నెలకొంది. ఈ నేపథ్యంలో ఆసక్తికరమైన వార్త ఒకటి ఫిలిం వర్గాలలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీని ఓ పీరియాడిక్ డ్రామాగా త్రివిక్రమ్ తెరపైకి తీసుకురాబోతున్నారని ఇందులో హీరో మహేష్ బాబు ద్విపాత్రిభియం చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. పీరియాడిక్ నేపథ్యానికి ప్రస్తుత కాలానికి లింక్ చేస్తూ ఈ సినిమా కథ సాగుతుందని చెబుతున్నారు. ఈ రెండు పాత్రలను త్రివిక్రమ్ డిజైన్ చేసిన తీరు ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుందని అంటున్నారు.

త్రివిక్రమ్ సిద్ధం చేసిన స్క్రిప్ట్ హైలైట్ గా ఉండనుందని టాక్ నడుస్తోంది. రామ్ – లక్ష్మణ్ కంపోజ్ చేసిన యాక్షన్ సీన్స్ తో ఫస్టు షెడ్యూల్ మొదలవుతుందని చెబుతున్నారు. త్రివిక్రమ్ – మహేశ్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న 3వ సినిమా కావడంతో అభిమానులంతా ఆసక్తితో ఉన్నారు. ఈ సినిమాలో ఒక కథానాయికగా పూజ హెగ్డేను తీసుకున్నారు. రెండవ కథానాయికగా ప్రియాంక అరుళ్ మోహన్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాని పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *