యనివర్సల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం రాధేశ్యామ్. చాలా సంవత్సరాలుగా ప్రభాస్ సినిమాకోసం వెయిట్ చేసిన ఫ్యాన్స్ కి ఈ సినిమా మంచి విజువల్ ట్రీట్ గా రిలీజైంది. అంతే గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా ఆడియన్స్ ని మెప్పించిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం..

అసలు ఈ సినిమా కథేంటి

విక్రమాధిత్య అంటే ప్రభాస్ యూరోప్ లో పేరు మోసిన హస్తసాముద్రిక నిపుణుడు. పెద్ద జోతిష్యుడు. ఎంట్రీలోనే ఇందిరాగాంధీ చేయి చూడంటంతో కథ స్టార్ట్ అవుతుంది. అక్కడ్నుంచీ ప్రేరణ అంటే పూజాహెగ్ధేని ప్రేమిచడం, ఆ తర్వాత తన ప్రేమ ప్రయాణాన్ని మొదలుపెట్టడం స్టార్ట్ చేస్తాడు విక్రమాధిత్య. ఎప్పుడైతే పూజాహెగ్ధే కూడా ప్రేమించడం మొదలుపెట్టిందో అప్పట్నుంచీ కథ మరో లెవల్లోకి వెళ్తుంది. మరి చివరకి ప్రేమగీతే లేని విక్రమాధిత్య ప్రేరణ ప్రేమని పొందాడా లేదా అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటి ?

సినిమాకి కథ కీలకం. ఇందులో దర్శకుడు చాలా క్లారిటీగా ఉన్నాడు. అలాగే ప్రభాస్ స్టైల్, పూజాహెగ్దే గ్లామర్ సినిమాకి హైలెట్. విజువల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అలాగే ఆర్డ్ డైరెక్టర్ సింప్లీ సూపర్బ్. ప్రతి సీన్ లో ప్రతి విజువల్ ఎక్స్ ట్రాడనరీగా అనిపిస్తుంది. మేకింగ్ పరంగా సినిమా సూపర్. అదే సినిమాకి ప్లస్ పాయింట్. లవ్ సీన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, షిప్ లో సీన్స్ సినిమాకి హైలెట్. క్లైమాక్స్ సీన్స్ కూడా సినిమాని ఒక రేంజ్ లో చూపించాయి. మ్యూజిక్ పరంగా చూస్తే రెండు సాంగ్స్ సినిమాకి హైలెట్ అనే చెప్పాలి. ఎవరో నీ వెవరో సాంగ్, ఛలో ఛలో సాంగ్స్ హైలెట్ గా ఉన్నాయి. ప్రొడక్షన్ , మ్యూజిక్, కెమెరా అద్భుతం. అదే సినిమాని నిలబెట్టింది.

సినిమాలో మైనస్ పాయింట్స్ ఏంటి ?

స్క్రీన్ ప్లే కొద్దిగా మెల్లగా అనిపిస్తుంది. అలాగే, ప్రేమలో ఎమోషనల్ సీన్స్ మరిన్ని రాసుకుని ఉంటే బాగుండేది. ఆ ఎమోషన్ ని మిస్ అయ్యారు. హీరో హీరోయిన్ మద్యలో కెమిస్ట్రీ సూపర్ గా ఉన్నా అందుకు తగ్గ ఎమోషనల్ సీన్స్ తగ్గాయి. ఫస్టాఫ్ కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది. అలాగే జగపతిబాబు, భాగ్యశ్రీ, సచిన్ ఖాడ్కేర్, జయరాం వీళ్ల పాత్రలకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు.

ఓవర్ ఆల్ గా చెప్పాలి అంటే చేతిరాతలు కాదు, మన రాతని మనమే మార్చుకోవాలి అనే విధంగా సాగుతుంది సినిమా. వీకండ్ ఖచ్చితంగా ఈ సినిమా ప్లాన్ చేస్కోవచ్చు. డిస్సపాయింట్ అయితే అవ్వరు.

రేటింగ్ 2.75 అవుట్ హాఫ్ 5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *