స్వయం కృషితో ఎంత ఎత్తుకు అయినా ఎదగవచ్చు. ఈ అమూల్యమైన సూక్తి అందరికీ తెలుసు.. కానీ కొందరే ఆచరిస్తారు.. వారే తమ లక్ష్యాలను నిర్దేశించుకుంటారు.. ఆ లక్ష్యం చేరుకునేదాకా అవిశ్రాంతంగా శ్రమిస్తారు. వారే మిగిలిన వారికీ దారి చూపే దిశా నిర్దేశకులు.. అందరికీ మార్గదర్సకులు.. ఆ కోవకి చెందిన వారే ది గ్రేట్ లెజెండ్ కంస్ట్రక్షన్స్ అధినేత శ్రీ నాగేశ్వర రావు గారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, కష్టపడి ఇష్టపడి చదివి ఇంజినీరింగ్ పట్టా తీసుకుని, ఇండియా లో, దుబాయ్ లో కొన్ని సంస్థలలో పనిచేసి, ఆ అనుభవంతో తానే సొంతంగా నలుగురికి ఉపాధి చూపించాలనే ద్యేయంతో లెజెండ్ కంస్ట్రక్షన్స్ ద్వారా తన వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించారు. కొంతమందికి కాక కొన్ని వందల కుటుంబాలకు ఉపాధి అందించారు శ్రీ నాగేశ్వర రావు గారు. ఎంత స్థాయిలో ఉన్నా ఒదిగి ఉండడమే అయన తత్త్వం. తన స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకునే వ్యక్తిత్వం ఆయనది. అంతేకాదు.. ఎందరో విద్యార్థులకు చదువుకు సాయం చేసిన గొప్ప మానవతా మూర్తి శ్రీ నాగేశ్వర రావు గారు.
ఆయన వ్యాపారవేత్త మాత్రమే కాదు ఒక రియల్ లెజెండ్. అసాధ్యాలను కూడా తన భగీరథ ప్రయత్నంతో సుసాధ్యాన్ని చేసి తెలుగు రాష్ట్రాలలో లెజెండ్ సంస్థ ని శిఖరాగ్రానికి చేర్చారు అయన. అయన ఇంకా ఎన్నో విజయాలను సాధించాలని మా వెబ్ సైట్ ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం.
