పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు సభ్యులు కొన్ని డైలాగ్స్ కు మ్యూట్ చెబుతూ U/A సర్టిఫికెట్ ను జారీ చేసింది. ఈ సినిమాపై సెన్సార్ బోర్డు సభ్యులు ప్రశంసల జల్లులు కురిపించారు. విదేశాలలో కూడా ఈ సినిమా విడుదల కానుండటంతో అక్కడ కూడా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఓవర్సీస్ లో సెన్సార్ సభ్యుడిగా ఈ సినిమాని చూసిన ఉమైర్ సందు తన రివ్యూని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ పవన్ కళ్యాణ్ గ్రాండ్ ఎంట్రీ
గూస్ బంప్స్ తెప్పించింది. అందుకే ఆయన పవర్ స్టార్ అయ్యారు. ఆ స్టైల్ ను ఎవరూ మ్యాచ్ చేయలేరు.

రానా ఎంట్రీ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంది. ఈ సినిమాపై నేను చెబుతున్న మాటలను గుర్తించుకోండి. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అతి పెద్ద హిట్ గా ఈ సినిమా నిలుస్తుంది. పవర్ ప్యాక్ మూవీ సూపర్ హిట్ కావడం ఖాయం. పూర్తి రివ్యూ త్వరలోనే ఇస్తానంటూ’ ఆయన వరుసగా ట్వీట్లు చేశారు. ఆయన చేసిన ట్వీట్ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నా సినీ వర్గాలు మాత్రం సైటర్లు వేస్తున్నారు. అజ్ఞాతవాసి సినిమా కూడా అదిరిపోయింది అంటూ 4 రేటింగ్ ఇచ్చిన ఉమైర్ సంధు చెప్పే రివ్యూస్ ని అంతగా పట్టించుకోవలసిన అవసరం లేదంటూ వారు చెబుతున్నారు.

కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో సెన్సార్ బోర్డు సభ్యులు మెచ్చుకోవడంతో భీమ్లా కోసం ఫిలిం వర్గాలు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాయి. మరో వారం రోజుల్లో విడుదల కానుండగా, చిత్రబృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 21న ప్రీ రిలీజ్ వేడుక ఉంటుందని సమాచారం. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన భీమ్లా నాయక్ చిత్రంలో పవన్ ఓ పోలీసాఫీసర్ పాత్ర పోషించారు. రానా మెయిన్ విలన్ గా నటించారు. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు రాశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *