ప్రభాస్ తన మార్కెట్ దమ్ముని మరోసారి చూపించే టైమ్ వచ్చిందా అంటే నిజమే అంటున్నారు టాలీవుడ్ తమ్ముళ్లు. ప్రేమకి, విధికి జరిగే పోరాటాన్ని ఆసక్తికరంగా వెండితెరపై రాధేశ్యామ్ అంటూ చూపించేందుకు ప్రభాస్ అండ్ టీమ్ రెడీ అయిపోయింది. రాధేశ్యామ్ డైరెక్టర్ రాధాకృష్ణ ఈసారి అఫీషియల్ గా రిలీజ్ డేట్ ని విడుదల చేశాడు. ఈ సినిమా మార్చి 11వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. లాస్ట్ టైమ్ కరోనా వేవ్ అడ్డంకి వచ్చినా ఈసారి మాత్రం ఖచ్చితంగా విడుదల అవుతుందని అంటున్నారు. అయితే, కొన్నిరోజులుగా ఈ సినిమా ఓటీటీలో వస్తోందని ప్రచారం జరిగింది. వీటన్నింటికి ఇప్పుడు పుల్ స్టాప్ పెట్టినట్లు అయ్యింది.
ఇక కరోనా ఆంక్షలు తగ్గుముఖం పడుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో మళ్లీ థియేటర్స్ ఓపెన్ అవుతున్నాయి. ఫిబ్రవరి నెలాఖరు నాటికి ఖచ్చితంగా పరిస్థితి సద్దుమణుగుతుంది. అందుకే, ఇప్పుడు మార్చి రెండోవారంలోనే ఈసినిమాని రిలీజ్ చేస్తే అత్యధిక కలక్షన్స్ ని టార్గెట్ చేయచ్చు.
ఈసినిమా లవ్ స్టోరీ కాబట్టి ఖచ్చితంగా బాలీవుడ్ సినీ ప్రేమికుల్ని అలరిస్తుంది. ఇప్పటికే పుష్ప ఫీవర్ లో ఉన్న బాలీవుడ్ సౌత్ నుంచీ మరో సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ టైమ్ లో ప్రభాస్ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయితే ఖచ్చితంగా మార్కెట్ ని కొల్లగొట్టచ్చని చెప్తున్నారు. అంతేకాదు, సాహో సినిమా తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఖచ్చితంగా భారీవసూళ్లని సాధించే అవకాశం కనిపిస్తోంది.
ఈ సినిమాలో ప్రభాస్ హస్తసాముద్రిక నిపుణిడిగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు, తన ప్రేమని గెలిపించుకోవడం కోసం హీరో ఏం చేశాడు అనేది అత్యంత ఆసక్తికరంగా ఉండబోతోంది. టైటానిక్ లవ్ స్టోరీని తలపిస్తున్న ఈ సినిమా ఏమాత్రం హిట్ టాక్ వచ్చినా కాసుల వర్షం కురిపిస్తుంది. 500కోట్లు వసూళ్లు చేసినా ఆశ్చర్యం లేదని భావిస్తున్నారు ట్రేడ్ పండితులు. మరి చూద్దాం ప్రభాస్ దమ్మెంత అనేది ఈ సినిమాతో తెలిసిపోతుంది. అదీ మేటర్.