టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోలంటే మనకు నాని, విజయ్ దేవరకొండ, శర్వానంద్, నాగ చైతన్య మనకు గుర్తుకు వస్తారు. వీరు ఎవరికీ దక్కని ఓ రికార్డును నాగ చైతన్య సొంతం చేసుకున్నాడు. చైతూ నటించిన నాలుగు చిత్రాలు వరుసగా 50 కోట్ల క్లబ్ లో చేరడం విశేషం. స్వచ్ఛమైన ప్రేమ కథగా తెరకెక్కిన మజిలీ సినిమా మొదటగా 50 కోట్ల క్లబ్ లో చేరింది. సమంత హీరోయిన్ గా నటించిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి మంచి వసూళ్లను రాబట్టింది. ఆ తరువాత చైతూ మేనమామ విక్టరీ వెంకటేష్ తో ‘వెంకీ మామ’ సినిమా చేశాడు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకొని 50 కోట్లకు పైగా వసూల్ చేసింది. ఈ రెండు సినిమాలు ఇచ్చిన జోష్ లో చైతూ సెన్సిబుల్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్సకత్వంలో లవ్ స్టోరీ సినిమాలో నటించాడు.

సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వస్తూ ఎట్టకేలకు గత ఏడాది అక్టోబర్ లో విడుదలయింది. ఈ సినిమా మంచి టాక్ తో దూసుకెళ్లి 50 కోట్ల క్లబ్ లో ఈజీగా చేరింది. ఇక ఆయన నటించిన లేటెస్ట్ చిత్రం బంగార్రాజు. ఈ సినిమా కూడా కేవలం మూడు రోజుల్లోనే 50 కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డు నెలకొల్పింది. వరుసగా చైతూ నటించిన చిత్రాలు 50 కోట్లకు పైగా వసూల్ చేయడం నయా రికార్డు అంటూ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమా 5 రోజుల్లో
31.59 కోట్ల షేర్ 63.60 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది.

Nizam: 6.82Cr
Ceeded: 4.90Cr
UA: 3.22Cr
East: 2.85Cr
West: 1.96Cr
Guntur: 2.57Cr
Krishna: 1.35Cr
Nellore: 1.27Cr
AP-TG Total:- 27.57CR(52.02Cr~ Gross)
Ka+ROI: 1.82Cr
OS – 1.45Cr
Total WW: 31.59CR(63.60CR~ Gross)

39 కోట్లకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 7 కోట్లు సాదించవలసి ఉంది. ఏపీలో మంగళవారం నుంచి నైట్ కర్ఫ్యూలను విధించారు. అంతే గాకుండా 50 శాతం ఆక్యుపెన్సీలతో థియేటర్లను రన్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో చాలా థియేటర్లలలో మూడు షోలు మాత్రమే పడుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగార్రాజు బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా? లేదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ సినిమాని స్వయంగా నిర్మించిన నాగార్జున అయితే ఓ రేంజ్ లో టెన్షన్ పడుతున్నాడట. మరి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు.

మొత్తానికి అది మ్యాటర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *