ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే రూ. 315 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను ఈ సినిమా రాబట్టింది. ఇప్పటికే ఈ చిత్రంబాలీవుడ్ లో రూ. 80 కోట్ల క్లబ్ లో చేరి 100 కోట్ల దిశగా దూసుకెళ్తోంది. మరోవైపు వీకెండ్ సందర్భంగా శని, ఆదివారాల్లో సినిమా కలెక్షన్లు పెరిగినట్టు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా గత శుక్రవారం రూ.1.95 కోట్లు, శనివారం రూ.2.56 కోట్లు, ఆదివారం రూ.3.48 కోట్లు రాబట్టిందని ప్రకటించిన ట్రేడ్ వర్గాలు మొత్తానికి రూ.80.48 కోట్లు సాధించిందని వివరించాయి. ఇక 25వ రోజు అంటే సోమవారం కూడా ఈ సినిమా కోటి 42 లక్షల గ్రాస్ వసూల్ చేసిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
తాజాగా ఈ సినిమాను చూసిన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ అద్భుతంగా ఉందని కితాబునిచ్చింది. ‘పుష్ప’ ఫొటోను షేర్ చేస్తూ ‘ప్రపంచంలోనే అత్యంత కూల్ మేన్’ అని వ్యాఖ్యానించింది. మైండ్ బ్లోయింగ్ మూవీ అని కొనియాడింది.బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న సమయంలోనే ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి ఈ సినిమాని జనవరి 14 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటన వచ్చింది. ఈ సినిమా తెలుగు వర్షన్ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయింది. ఇప్పుడు హిందీ వర్షన్ రిలీజ్ కాబోతుండటంతో 100 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం మిస్ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరాలంటే ఇంకా దాదాపు 18 కోట్లు వసూల్ చేయవలసి ఉంది. అద్భుతమైన అవకాశాన్ని తమ హీరోకు మిస్ చేశారంటూ అభిమానులు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పై మండిపడుతున్నారు.
ఇక ఈ సినిమా బాలీవుడ్ 25 రోజుల కలెక్షన్స్ ను ఒకసారి పరిశీలిస్తే
Day1-3.31C
Day2-3.79C
Day3-5.56C
Day4-3.7C
Day5-3.6C
Day6–3.53C
Day7-3.4C
Day8-2.31C
Day9-3.75C
Day10-4.25C
11-2.75C
12-5.5C
13-2.4C
14-2.24C
15-3.5C
16-6.1C
17-6.25C
18-2.75C
19-2.5C
20-2.25C
21-2.05C
22-1.95C
Day23-2.56C
Day24-3.48C
Day 25- 1.42
Total–81.90CR
ఈ వీకెండ్ కు పుష్ప సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. కానీ మరో మూడు రోజుల్లో ఈ సినిమా ఓటీటీలో రానుంది. ఒకవేళ ఓటీటీలో విడుదలైనా థియేటర్లలలో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబడితే ఈ చిత్రం 100 కోట్ల క్లబ్ లో చేరనుంది. ఒకవేళ అదే జరిగితే తొలి సినిమాతోనే 100 కోట్ల క్లబ్ లో చేరిన హీరోగా అల్లు అర్జున్ నయా రికార్డు నెలకొల్పనున్నాడు. మరి ఐకాన్ స్టార్ ఆశలు ఫలిస్తాయా? లేదా? అనేది జనవరి 14న తేలనుంది.