ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప విడుదలై 24 రోజులు దాటిన బాలీవుడ్ లో మాత్రం జోరు మామూలుగా లేదు. ఈ సినిమా 24 రోజుల్లో 80 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ సినిమాకు పోటీ వచ్చే సినిమా ఇంతవరకు రాలేదని తెలిపిన ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ రైటర్ తరణ్ ఆదర్శ్ పుష్ప హిందీలో వన్ హార్స్ రేస్ కొనసాగిస్తోందని ట్వీట్ చేశారు. ఇప్పటికీ ఈ మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ భారత్‌లో నంబర్ 1గా ఉందని చెప్పారు. కరోనా సమయంలోనూ పుష్ప దూసుకుపోతోందని చెప్పిన ఆయన సినిమా హిందీలో గత శుక్రవారం రూ.1.95 కోట్లు, శనివారం రూ.2.56 కోట్లు, ఆదివారం రూ.3.48 కోట్లు రాబట్టిందని ఆయన చెప్పారు. మొత్తానికి రూ.80.48 కోట్లు సాధించిందని వివరించారు.
ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా ఆలిండియా రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. హిందీ మినహా ఇతర భాషల్లో ఈ సినిమా ఇప్పటికే ఓటీటీలోనూ విడుదలైంది. కానీ 24వ రోజు కూడా ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 2 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేయడం విశేషం. చేసిన మొదటి పాన్ ఇండియా సినిమాతోనే అల్లు అర్జున్ రికార్డు క్రియేట్ చేసాడంటూ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా 24 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 166 కోట్లకు పైగా షేర్ 315 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది.
Nizam: 40.50Cr
Ceeded: 14.97Cr
UA: 8.02Cr
East: 4.86Cr
West: 3.94Cr
Guntur: 5.07Cr
Krishna: 4.21Cr
Nellore: 3.08Cr
AP-TG Total:- 84.65CR(132CR~ Gross)
Karnataka: 11.45Cr
Tamilnadu: 10.70Cr
Kerala: 5.40Cr
Hindi: 37.45Cr
ROI: 2.22Cr
OS – 14.33Cr
Total WW: 166.20CR షేర్ (314.5CR~ Gross)
ప్రస్తుతం ఈ సినిమాకి పోటీగా ఏ సినిమా లేకపోవడంతో మరికొన్ని రోజులు పుష్ప రాజ్ తగ్గేదేలే అంటూ దూసుకుపోయే అవకాశం ఉంది. ఈ సినిమా మరో కొన్ని రోజుల్లో 100 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమంటూ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు అందించిన సంగీతం దేశ వ్యాప్తంగా మారుమోగిపోవడం విశేషం.మొత్తానికి అది మ్యాటర్