మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ చాలా రోజుల తరువాత రౌడీ బోయ్స్ అనే సినిమాలో ప్రేక్షకులకు కనిపించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు తనయుడు ఆశిష్ హీరోగా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేస్తున్నారు. ఈ సినిమా గురించి మొన్నటివరకు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. తన సినిమాని ఎలా ప్రమోట్ చేయాలో బాగా తెలిసిన దిల్ రాజు ఈ సినిమా ట్రైలర్ ను ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ పాజిటివ్ రెస్పాన్స్ పట్టేసి సినిమాపై అంచనాలను పెంచేసింది. హీరోయిన్ అనుపమ కోసం ఇంజనీరింగ్ స్టూడెంట్స్, మెడికల్ విద్యార్థుల కొట్లాట నేపథ్యంలో ఈ సినిమాని తీసినట్లు ట్రైలర్ ని చూస్తే మనకు అర్ధమవుతోంది. ఈ ట్రైలర్ బ్లాక్ బస్టర్ చిత్రాలు ప్రేమదేశం, చెలి సినిమాలా ఉందంటూ ఇండస్ట్రీ వర్గాలలో ప్రచారం జరుగుతోంది.
ఈ ట్రైలర్ లో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలిచింది ఎవరంటే అనుపమ గురించి చెప్పుకోవాలి. కొత్త హీరో అని కూడా చూడకుండా ఆశిష్ కు టైట్ హగ్గిచ్చి ఆమె లిప్ లాక్ లతో వేడెక్కించేసింది. ట్రైలర్ లోనే ఇలా రెచ్చిపోయి కనిపించిన అనుపమ ఇక పూర్తి సినిమాలో ఎలా రెచ్చిపోయిందో అంటూ ఇండస్ట్రీ వర్గాలలో చర్చ జరుగుతోంది. సినీ వర్గాలు చెబుతున్న ప్రకారం ఈ సినిమాలో అనుపమ నాలుగు లిప్ లాక్ లతో అదరగొట్టేయబోతున్నారట. అంతే కాకుండా సినిమా మొత్తం గ్లామరస్ గా కనిపించి సెగలు పుట్టించనుందని సమాచారం. ఇప్పటివరకు పద్దతిగా నటించిన అనుపమ ఇంత హఠాత్తుగా హాట్ సన్నివేశాలకు ఓకే చెప్పడం వెనుక దిల్ రాజు ఉన్నారనే చర్చ జరుగుతోంది. రౌడీ బోయ్స్ సినిమాలో క్యాస్టింగ్ మొత్తం కొత్తవారే. దిల్ రాజు తప్పా ఈ సినిమాకి పని చేసిన వారు కూడా మొత్తం కొత్తవారే. అందుకే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం అనుపమను ఏరికోరి మరి దిల్ రాజు ఫైనల్ చేశారు.
విడుదల చేసిన పాటలు, టీజర్ ను తెలుగు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు. దాంతో దిల్ రాజు ఈ సినిమాలో నాలుగు హాట్ సన్నివేశాలను చేర్చినట్లు ఫిలిం నగర్ లో టాక్ నడుస్తోంది. ఇందుకు మొదట్లో అనుపమ నో చెప్పినా దిల్ రాజు నచ్చచెప్పినట్లు తెలుస్తోంది. అగ్ర హీరోలతో లిప్ లాక్ లు ఇచ్చేందుకు నో చెబుతూ వచ్చిన ఆమె కుర్రహీరో ఆశిష్ కు ముద్దులు ఇచ్చేందుకు ఓకే చెప్పడంతో సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నారు. లిప్ లాక్ చేసినందుకు అనుపమకు దిల్ రాజు ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఇచ్చినట్లు ఫిలిం నగర్ లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఈ లిప్ లాక్ సన్నివేశంపై ఆమె అభిమానులు మండిపడుతున్నారు. నిర్మాత కొడుకు అయినంత మాత్రాన ఇంతలా రెచ్చిపోవాలా? అంటూ వారు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. మొత్తం మీద తన టైట్ హగ్, ఘాటైన లిప్ లాక్ తో అనుపమ ఈ సినిమాకి కావాల్సినంత హైప్ తీసుకువచ్చింది. మరి కేరళ కుట్టి అనుపమ కష్టం ఫలించిందా? లేదా? అనేది తెలియాలంటే జనవరి 14 వరకు ఆగవలసిందే.