ఓటీటీలో వచ్చే తెలుగు సినిమాలకి హద్దూ అదుపులేకుండా పోయిందా అనిపిస్తోంది. అంతేకాదు, బూతులు మాట్లాడటం దాన్ని ఓటీటీలో యాక్సెప్ట్ చేసేయడం కూడా జరిగిపోతోంది. అదేంటంటే బోల్డ్ గా సినిమా తీస్తున్నాం అని చెప్పి బెడ్ రూమ్ సీన్స్ ని కూడా తీసేస్తున్నారు. బాలీవుడ్ కల్చర్ ని తెలుగుకి యాప్ట్ చేసేసుకుంటున్నారు. అంతేకాదు, రీసంట్ గా క్రైమ్ పేరిట పిచ్చ పిచ్చ సినిమాలు కూడా తీసేస్తున్నారు. లాజిక్ కి అందదు, అసలు స్టోరీ లైన్ ఉండదు. మనకి ఏది అనిపిస్తే అది తీసేయడమే అయిపోయింది డైరెక్టర్స్ కి. నేను అందరి గురించి చెప్పడం లేదు. కేవలం కొందరి గురించి మాత్రమే చెప్తున్నాను.. ఈ కోవలోకి చెందిన ఒక చెత్త సినిమానే సేనాపతి. ఈ సినిమా గురించే ఎందుకు చెప్తున్నాను అంటే, రాజేంద్రప్రసాద్ లాంటి స్టార్ ని పెట్టుకుని కూడా ఇలాంటి సినిమా ఎందుకు చేశారు ? అసలు దీనికి రాజేంద్ర ప్రసాద్ ఎందుకు ఒప్పుకున్నారు అనేది పాయింట్. బహుశా తమిళంలో వర్జినల్ వెర్షన్ చూసి ఉండకపోచ్చని అనుకుంటున్నా..
మనం డైరెక్ట్ గా రివ్యూలోకి వెళ్లిపోదాం.. సినిమా చూడనివాళ్లు ఉంటే ఆ సినిమా చూసాకే నా రివ్యూ లోకి రండి.. లేకపోతే అర్ధం కాదు.
ఈ సేనాపతి సినిమా కథేంటి
చిన్నప్పుడే చేయని నేరానికి శిక్ష అనుభవిస్తూ జైల్లోనే చదువుకుని పోలీస్ అవుతాడు కృష్ణ. అంటే హీరో , అతడు ఒక దొంగని వెంబడిస్తూ గన్ ని పోగొట్టుకుంటాడు. దాన్ని తీస్కుని రాకపోతే జాబ్ పోతుంది. ఆ గన్ ని కొనుక్కున్న కృష్ణమూర్తి అంటే రాజేంద్ర ప్రసాద్ ఇద్దరితో కలిసి బ్యాంక్ రోబరీ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది సినిమా..
ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ కాదు, అసలు సినిమాలో ఉన్న లాజిక్ లెస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం..
- దరిద్రం ఏంటంటే, చిన్నపిల్లలని చెత్త ఏరుకునేవాళ్లగా చూపిస్తూ వాళ్లతో బూతులు మాట్లాడించడం. అది ఎందుకు వాళ్లుతో అలా మాట్లాడించాలి అనేది డైరెక్టర్ కే అర్ధం అవ్వాలి.
- కృష్ణమూర్తి గన్ ని మిస్ హ్యాండిల్ చేసి చిన్నపిల్లని బ్యాంక్ లోనే చంపేయడం.., దానికి ఆయన తెగ పశ్చాత్తాప పడిపోతాడు. కానీ, తనతో కలిసిన వాళ్లని మాత్రం తను దొరక్కూడదు అని చంపేస్తాడు. తన స్వార్ధపూరితమైన పిల్లల కోసం వేరేవాళ్లని చంపడం,, ఇదేం క్యారెక్టరైజేషన్ అనేది నాకు అర్ధం కాలేదు. దీనికి అసలు లాజిక్ ఉండదు. రాజేంద్రప్రసాద్ లాంటి గ్రేట్ యాక్టర్ ఈ క్యారెక్టర్ ఒప్పుకోవడం అనేది ఆయనకే తెలియాలి. ఎందుకు చెప్తున్నాను అంటే జాగ్రత్తగా వినండి..
ఒక చిన్నపిల్లని అనవసరంగా చంపేశానే అని పశ్చాత్తాపం చెందే కృష్ణమూర్తి.., అనవసరంగా తనతో కలిసిన ఇద్దర్నీ చంపేస్తాడు. అందులోనూ రాజు అనే డ్రైవర్ ని భయపడుతున్నా కూడా చంపేస్తాడు. కేవలం తను దొరక్కూడదనే ఉద్దేశ్యంతో , ఆ తర్వాత తనకి శత్రువులైన ఇద్దర్నీ కూడా చంపేస్తాడు. ఎందుకంటే తన వృత్తిలో వాళ్లు అడ్డువచ్చారని, ఫైనల్ గా తన భార్య షుగర్, తనకి క్యాన్సర్ అని సింపదీ క్యారెక్టర్ లోకి వచ్చేస్తాడు. ఈరెండు అస్సలు పొంతనలేనివి. - బ్యాంక్ లు గన్ కాల్చడం రాక మిస్ ఫైర్ అయ్యిందని చెప్పిన డైరెక్టర్, రాజుని చంపేటపుడు మాత్రం దూరం నుంచీ చీకట్లో చాలా ప్రొఫెషనల్ గా కాల్చాడు అని చెప్పడం. ఇది డైరెక్టర్ మిస్టేక్. నిజానికి తమిళంలో రీమేక్స్ చేసేటపుడు తెలుగు నెటివిటీకి చాలా దగ్గరగా తీస్కుని వస్తారు. లేదంటే వాటిని అలా వదిలేయడమే మంచిదని అలాగే చేసి ఉండచ్చు. అలా తమిళంలో 8 తూటక్కల్ సినిమాని రీమేక్ చేసిందే ఈ సేనాపతి. అందుకే కొన్ని సన్నివేశాలని యాజ్ టీజ్ గా అలాగే తీసేశారు.
- హీరో క్యారెక్టరైజేషన్.. ఫస్ట్ నుంచీ తన డ్యూటీకి చాలా సిన్సియర్ గా ఉంటానని, ఐపియస్ కి ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పిన కృష్ణ అంటే హీరో ఆ తర్వాత సదరు విలన్ దొరికిన తర్వాత చంపడానికి సందేహిస్తాడు.. ఎందుకో జాలి చూపించేస్తాడు. అంత జాలి చూపించాల్సిన పనేంటో సరిగ్గా కన్ క్లూజన్ ఇవ్వలేకపోయాడు డైరెక్టర్.
ఈ సినిమాని మాములుగా ఎవరినీ చంపకుండా కూడా తీయచ్చు. గన్ లో బుల్లెట్ తగిలి ఇంజ్యూర్ అయినట్లుగా కూడా చూపించచ్చు. అలాగే, రోబరీకి సహాయం చేసిన వారిని ఎస్కేప్ కూడా చేయించచ్చు. కానీ ఎందుకు అందర్నీ చంపేసిన కృష్ణమూర్తి అనే క్యారెక్టర్ చివరికి జాలిగా, అతని మీద దయ కలిగేలా ఎందుకు తీశారో ఆ డైరెక్టర్ కే తెలియాలి.
గమనిక – ఇది కేవలం రివ్యూ రైటర్ దృష్టికోణంలో చూసి రాసింది మాత్రమే.