RRR ఫస్ట్ రివ్యూ..!
బాహుబలి సినిమా తర్వాత యస్ యస్ రాజమౌళి తీసిన ప్రస్టేజియస్ ప్రాజెక్ట్ ట్రిబుల్ ఆర్. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ కలవడంతో ఈసినిమాపై భారీ అంచనాలు వచ్చేశాయి. అయితే, ముందుగానే ఈ సినిమా ఫ్రీడమ్ ఫైటర్స్ ఫాంటసీ అని రాజమౌళి ముందుగానే చెప్పేశారు. ఇద్దరి జీవితాల్లో రెండు సంవత్సరాల పాటు ఏం జరిగిందో కూడా చరిత్రకి తెలియదు అని, ఆ టైమ్ ని తీస్కుని ఊహించి కథ రాసుకున్నామని ముందుగానే రాజమౌళి ప్రకటించేశారు. దీంతో ఇంకా ఈసినిమాపై అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. అసలు అల్లూరి సీతారామరాజు, కొమురంభీమ్ కలిశారా..? కలిసినట్లుగా చరిత్రలో ఉందా లేదా అనేది మర్చిపోయి మరీ ఈసినిమా చూసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రిబుల్ ఆర్ యూనిట్ అన్ని భాషల్లోనూ పబ్లిసిటీని స్టార్ట్ చేసింది. అంతేకాదు, ఈసినిమా బాహుబలి రికార్డ్స్ ని సైతం బ్రేక్ చేసేలా కనిపిస్తోందని ట్రేడ్ వర్గాలు చెపుతున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవుతున్న ఈసినిమాకి సంబంధించి బాలీవుడ్ మీడియా నుంచూ ఫస్ట్ రివ్యూ బయటకి వచ్చేసింది. అంచనాలకి ఏమాత్రం తగ్గని విధంగా ఈ సినిమా ఉందని చెప్తున్నారు. ఫుల్ పాజిటివ్ రివ్యూని ఇచ్చారు.
బాహుబలి రిలీజ్ చేసిన స్క్రీన్స్ పైనే ఈ సినిమా కూడా ఉండబోతోంది. అంతేకాదు, ఈసారి ఓవర్సీస్ లో అత్యధికంగా ఎక్కువ స్క్రీన్స్ ని ఈ సినిమాకోసం బ్లాక్ చేశారని సమాచారం.
అందుకే, ఇప్పుడు బాలీవుడ్ మీడియా సైతం రివ్యూలు ఇచ్చేందుకు ఎగబడుతోంది. ఇక లీకు వీరులు సినిమా గురించి తెగ కామెంట్స్ చేసేస్తున్నారు. ఈ సినిమాలో సీతారామరాజు, కొమురం భీమ్ లో స్నేహం ఒక రేంజ్ లో ఉంటుందని, ప్రతి సీన్ లోనూ రాజమౌళి మార్క్ ఉంటుందని అంటున్నారు. ఇక ఈ మూవీ విజువల్ వండర్ గా కనిపించబోతోందని పాజిటివ్ రివ్యూస్ బయటకి వస్తున్నాయి. ఇక బాలీవుడ్ రివ్యూస్ అన్నీ కూడా పాజిటివ్ గా ఉండటంతో సినిమా అత్యధికంగా కలక్ట్ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది.
సుమారు 500 కోట్లతో తీసిన ఈ సినిమాకి దాదాపుగా 1000 కోట్ల మార్కెట్ ని అంచనా వేస్తున్నారు.
తెలుగు, హిందీ భాషలతో పాటుగా మిగతా భాషల్లో కూడా సినిమా మోత మోగిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది. కలక్షన్స్ పరంగా ఎటువంటి ఢోకా లేకుండా ముందుకు వెళ్లబోతోంది ఈ సినిమా. జనవరి 7వ తేదిన సంక్రాంతి మార్కెట్ ని కూడా గ్రాబ్ చేసుకునే దిశలో అడుగులు ముందుకు వేస్తోంది. అందుకే, రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్ కలక్షన్స్ వస్తాయని చెప్తున్నారు. ఫస్ట్ డే అన్ని భాషల్లో కలిపి 100కోట్లు దాటిపోతుందని, అంతకంటే ఎక్కువ వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదని అంటున్నారు. అదీ మేటర్.