బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ – 6 కి సర్వం సిద్ధమైందా అంటే నిజమే అనే వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరి 20వ తేది నుంచీ ఓటీటీలో బిగ్ బాస్ రియాలిటీ షో అనేది స్టార్ట్ కాబోతోంది. ఇందులో యూట్యూబర్స్. యాంకర్స్, సీరియల్ ఆర్టిస్ట్, సినిమా సెలబ్రిటీస్ ఉండబోతున్నారు. మొత్తం 15మంది పార్టిసిపేట్ చేసే ఈ బిగ్ బాస్ షో ఓటీటీలో 24గంటల పాటు ప్రసారం కాబోతోంది. దీనిని లైవ్ స్ట్రీమింగ్ ద్వారా హాట్ స్టార్ లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రేక్షకులు చూసే విధంగా ఉంచబోతున్నారు. ఈ బిగ్ బాస్ షోలో పాల్గొన్న పార్టిసిపెంట్స్ లో టాప్ – 5 లో నిలిచిన కంటెస్టెంట్స్ ని నేరుగా బిగ్ బాస్ సీజన్ – 6కి తీసుకుని రాబోతున్నారు. వీళ్లకి ప్రైజ్ మనీతో పాటుగా బోలెడన్ని గిఫ్ట్స్ కూడా రాబోతున్నాయి. ఓటీటీలో వచ్చే బిగ్ బాస్ షోకి, అలాగే మాటీవిలో వచ్చే బిగ్ బాస్ షోకి నాగార్జునే యాంకర్. ఇందులో పార్టిసిపేట్ చేసేవాళ్లలో ఢీ ఫేమ్ రాజు, యాంకర్ విష్ణుప్రియ, ఆర్టిస్ట్ నవ్యస్వామి, యాంకర్ రష్మి వీళ్లతో పాటుగా కొందరు ఆర్టిస్ట్ ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.