యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ‘కార్తికేయ2’ చిత్రం గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి, మంచి హిట్ టాక్ ను సంపాదించుకుంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన ఈ చిత్రానికి ఉత్తరాదిన కూడా మంచి స్పందన వస్తోంది. మొత్తం మీద ఈ చిత్రం మంచి వసూళ్లను రాబడుతోంది. చందు మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా విజయం సాధించడంపై సినీ ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. తెలుగు సినీ ప్రముఖులు ఈ చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలియచేయగా తాజాగా నేషనల్ స్టార్ ప్రభాస్ ఈ చిత్రంపై ప్రసంశల జల్లులు కురిపించారు.
‘నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, చందూ మొండేటి, భైరవుడు, ‘కార్తికేయ2′ టీమ్ సభ్యులందరికీ సినిమా బ్లాక్ బస్టర్ అయిన సందర్భంగా శుభాకాంక్షలు’ అని ప్రభాస్ ట్వీట్ చేశాడు. ఆయన ట్వీట్ చేయడంతో కార్తికేయ-2కు బాగా హెల్ప్ అయిందని సినీ పండితులు చెబుతున్నారు. ప్రభాస్ ట్వీట్ చేయడంతో ఈ సినిమా కలెక్షన్స్ పెరిగాయంటూ ట్రేడ్ వర్గాలు కూడా చెబుతుండటం విశేషం. ప్రభాస్ ట్వీట్ పట్ల నిఖిల్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు.” ప్రభాస్ భాయ్ మీ విషెస్ కి ధన్యవాదాలు. మీ మెసేజ్ తో ‘కార్తికేయ2’ టీమ్ ఎంతో సంతోషంగా ఉంది” అంటూ నిఖిల్ ఎమోషనల్ అయ్యాడు.
Nizam: 5.26Cr
Ceeded: 2.15Cr
UA: 1.80Cr
East: 1.17Cr
West: 85L
Guntur: 1.30Cr
Krishna: 1.02Cr
Nellore: 47L
AP-TG Total:- 15.71CR
KA+ROI – 1.06Cr
OS – 2.55Cr
North India – 1.50Cr
Total World Wide:- 20:15 కోట్ల షేర్ 39.42 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించి 7 కోట్లకు పైగా లాభాలు తీసుకువచ్చిన ఈ చిత్రం ఈజీగా 30 కోట్లకు పైగా వసూల్ చేయనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.