లెక్కల మాస్టర్ సుకుమార్ ప్రస్తుతం పుష్ప-2 ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ ను లాక్ చేసిన ఆయన ప్రస్తుతం క్యాస్టింగ్ ను ఫైనల్ చేస్తున్నాడు. పాన్ ఇండియా నేటివిటీ కోసం విజయ్ సేతుపతి, మనోజ్ బాజ్పాయ్ ను రంగంలోకి దింపిన ఆయన ఇప్పుడు స్టార్ యాక్ట్రెస్ సమంతను తీసుకున్నట్లు చెబుతున్నారు. తన ఫేవరేట్ హీరోయిన్ సమంత అని సుకుమార్ పలు సందర్భాలలో చెప్పిన సంగతి తెలిసిందే. ఆమె నటనలో ఈజ్ కారణంగానే ‘రంగస్థలం’ సినిమాలో హీరోయిన్ గా ఆమెను ఎంచుకున్నానని సుకుమార్ తెలిపాడు. ఆ తరువాత తాను తీసే పుష్ప సినిమాలోనూ ఆమెను తీసుకున్నారు.
చైతూతో బ్రేకప్ తరువాత ఆమె ఆలస్యంగా ఈ సినిమా సెట్స్ లో జాయిన్ అయ్యారు. అప్పటికే షూటింగు చాలావరకూ పూర్తికావడంతో, ఐటమ్ సాంగ్ కోసం ఆమెను తీసుకున్నాడు. ‘ఊ అంటావా మావా’ అనే పాటలో ఆమె ఇటు యూత్ ను .. అటు మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేసింది. ఆ పాటతో ఆమెకు పాన్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఆ పాట పూర్తి కాగానే ఆమె ఆ సినిమాలో కనిపించదు. దాంతో సామ్ అభిమానులు నిరాశకు లోనయ్యారు. వారి అంచనాలను దృష్టిలో పెట్టుకొని సుకుమార్ పుష్ప-2లో సమంత పాత్రను సరికొత్తగా డిజైన్ చేసినట్లు టాక్ నడుస్తోంది. స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్పకి సాయపడే పాత్రలో ఆమె ‘పుష్ప 2’లో కనిపించనుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. రెండవ పార్ట్ లో కూడా వీరిద్దరి మధ్య వచ్చే ఓ స్పెషల్ సాంగ్ హైలైట్ గా ఉండనుందట.
ఆమె పాత్రను సుకుమార్ చాలా డిఫరెంట్ గా డిజైన్ చేసినట్టు చెబుతున్నారు. పుష్ప కోసం ఆమె ప్రాణత్యాగానికి కూడా సిద్ధమవుతుందని వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. చాలా సహజంగా ఆమె పాత్ర ఉండటం జరుగుతుందని అంటున్నారు. ఇక ‘పుష్ప 2’లో ప్రియమణి పేర్లు కొత్తగా వినిపిస్తోంది. ఆమె విజయ్ సేతుపతి భార్యగా కనిపించనున్నారని చెబుతున్నారు. ఫహద్ ఫాజిల్ రోల్ సెకండ్ హాఫ్ లో బన్నీని డామినేట్ చేసే స్థాయిలో ఉండనున్నట్లు చెబుతున్నారు. ఈ నెల 3వ వారంలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాని శరవేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ కు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.