మాధవన్ హీరోగా యాక్ట్ చేసిన నంబి నారాయణ్ బయోపిక్ సినిమా ఎప్పట్నుంచో రిలీజ్ కోసం వెయిటింగ్ లో ఉంది. రాకెట్రీ – ది నంబి ఎఫెక్ట్ అంటూ మాధవన్ నిర్మాతగా కూడా మారారు. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలియాలంటే మనం రివ్యూలోకి వెళ్లాల్సిందే.

అసలు ఈ నంబినారాయణ్ కథేంటి


నంబి నారాయణన్ (మాధవన్) ఒక సైంటిస్ట్. ఇస్రోలో వర్క్ చేస్తుంటాడు. . దేశ రహస్యాలు పాకిస్తాన్‌కు చేరవేశారనే అభియోగం మీద పోలీసులు నంబి నారాయణ్ ని అరెస్ట్ చేస్తారు. కొన్ని రోజుల తర్వాత బెయిల్ మీద బయటకు వస్తారు. కొన్నాళ్లకు నిర్దోషి అని తెలుస్తుంది. అయితే… పోలీసులు అరెస్ట్ తర్వాత నంబితో పాటు అతని కుటుంబాన్ని సమాజం ఎలా చూసింది? ఆయన నిరపరాధి అని, ఎటువంటి తప్పు చేయలేదని ఎలా నిరూపించబడింది? నంబిపై నిరాధారమైన కేసు బనాయించి, ఆయనపై దేశద్రోహి అని ముద్ర వేయడానికి ముందు, తర్వాత దేశం కోసం ఆయన ఏం చేశారు? ఏయే త్యాగాలు చేశారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ప్లస్ పాయింట్స్ ++

ఫస్ట్ ఇది సినిమా కాదు బయోపిక్. కాబట్టి ఒకరి జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగానే తీయాలి. అలాంటిది దేశద్రోహి అని ముద్రపడిన తర్వాత నిర్దోషి అని తెలిసిన తర్వాత కథని చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది. ఈ సినిమా తీయడంలో చిత్రయూనిట్ మొత్తం కష్టపడిందని చెప్పొచ్చు. అదే సినిమాకి ప్లస్ పాయింట్. అసలు కొన్ని సీన్స్ తీయడానికి ఎంత కష్టపడ్డారో సినిమా చూస్తే అర్ధమవుతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ హై రేంజ్ లో ఉన్నాయి. మాధవన్ యాక్టింగ్ సినిమాని మరో మెట్టు ఎక్కించింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఎమోషన్ పీక్స్ లో ఉంటుంది. అదే సినిమాకి ప్రాణం.

మైనస్ పాయింట్స్ – –

ఫస్టాఫ్ కొద్దిగా స్లోగా సాగుతుంది. నిజజీవతంలో జరిగిన సంఘటనలు కాబట్టి అలాగే తీయాల్సి వచ్చింది. కొద్దిగా లెంగ్త్ కట్ చేసి ఉంటే బాగుండేది.

ఓవర్ ఆల్ గా చెప్పాలంటే ఖచ్చితంగా బయోపిక్స్ ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది. వీకండ్ ఖాళీగా ఉంటే సినిమా చూడండి డిస్సపాయింట్ మాత్రం అవ్వరు.

రేటింగ్ 2.5 అవుట్ హాఫ్ 5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *