బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ షో స్టార్ట్ కాబోతోంది. శనివారం సాయంత్రం ఆరు గంటల నుంచీ భారీ ఈవెంట్ తో ఒక్కొక్కరు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ షో 12వారాలు ఉండబోతోంది. లాస్ట్ వీక్ టాప్ 5 నుంచీ ఒకర్ని విజేతగా ప్రకటిస్తారు. అంతేకాదు, ఇందులో ఈసారి సీనియర్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా పాల్గొనబోతున్నారు. అందుకే, ఇప్పుడు అందరిలోనూ ఈషోపై మరింత ఆసక్తి పెరిగింది. ఆల్రెడీ ఒకసారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వచ్చినవారు కాబట్టి ఈసారి గేమ్ ఎలా ఆడతారు అనేది ఇప్పుడు ఇంట్రస్టింగ్. ఒక్కసారి మనం సీనియర్ పార్టిసిపెంట్స్ ని చూసినట్లయితే,
అఖిల్ సార్ధక్, అరియానా గ్లోరీ, హమీదా, ముమైత్ ఖాన్, అషూరెడ్డి, సెవన్ ఆర్ట్స్ సరయు, తేజస్విని మడివాడ, నటరాజ్ మాస్టర్, రోల్ రైడా, మహేష్ విట్టాలు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇక కొత్తవాళ్లలో మిత్రా శర్మా, ఆర్జే చైతూ, యాంకర్ శివ, స్రవంతి చొక్కారపు,శ్రీరాపక, బిందుమాధవి, ఇంకా మోడల్ అనిల్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే వీళ్ల ఇంట్రడక్షన్స్ అన్నీ షూటింగ్ చేశారని, నాగార్జున వీళ్ల గురించి ఎవిలు చూపిస్తూ పాత బిగ్ బాస్ కంటెస్టెంట్స్ జెర్నీలని కూడా చూపిస్తూ హౌస్ లోకి పంపించబోతున్నారని టాక్.
ఇక ఫస్ట్ డేనే సీక్రెట్ రూమ్ కూడా ఉండబోతోందని చెప్తున్నారు. ఇందులో భాగంగా ఈసారి కొత్తవాళ్లలో ఒకరిని,, అలాగే సీనియర్స్ లో ఒకరిని కలిపి సీక్రెట్ రూమ్ లో ఉంచబోతున్నారు. అంతేకాదు, హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగానే నామినేషన్స్ కూడా ఉంటాయనేది టాక్. ఈసారి టాస్క్ లని కూడా ఓటీటీకి తగ్గట్లుగానే డిజైన్ చేశారు. ఇక ఈసారి షోలో బోల్డ్ కంటెంట్ కూడా ఉండబోతోందనేది టాక్. ముఖ్యంగా గ్లామర్ కి పెద్ద పీటవేసినట్లుగా తెలుస్తోంది. పార్టిసిపెంట్స్ ని చూసినట్లయితే, అషూరెడ్డి, శ్రీరాపాక, తేజస్విని, బిందుమాధవి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా ఉండబోతున్నారు. హౌస్ లో ఈసారి జరిగే సంఘటనలు అన్నీ 24గంటలు ఆడియన్స్ కి చూపించేలా షోని డిజైన్ చేశారు. ఒకటి లేదా రెండు గంటల వ్యవధిలో షో ప్రేక్షకులని చూపించబోతున్నారు. అయితే, ఇక్కడ శని ఆది వారాలు మాత్రం హోస్ట్ నాగార్జున ఎంతసేపు షోని లీడ్ చేస్తాడు అనేది క్లారిటీ లేదు. 3 గంటల నుంచీ 4గంటల వరకూ ఇది ఉండచ్చని అంచనా వేస్తున్నారు. వీకెండ్స్ మాత్రం ఖచ్చితంగా పండగనే చెప్పాలి. ఈసారి ఎలిమినేషన్స్ కూడా ఎక్కడా లీక్ అవ్వకుండా బిగ్ బాస్ టీమ్ జాగ్రత్తలు తీస్కుంది.
ఇక నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ కి బిగ్ బాస్ లవర్స్ అందరూ సిద్ధమైపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *