టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయాలని ప్రతి ఒక్క దర్శకుడు కథలను సిద్ధం చేసుకుంటారు. సీనియర్ దర్శకులు రాఘవేంద్రరావు, బీ గోపాల్, కృష్ణవంశీ, గుణశేఖర్, జయంత్ సీ పరాంజీలతో బాటు ప్రజంట్ జనరేషన్ దర్శకులైన త్రివిక్రమ్ శ్రీనివాస్, పూరి జగన్నాథ్, శ్రీను వైట్ల, ఎస్ జే సూర్య, శ్రీకాంత్ అడ్డాల, వంశీ, కొరటాల శివ, పరశురామ్ లతో మహేష్ ఇప్పటివరకు సినిమాలు చేస్తూ వస్తున్నారు. తనకు హిట్ ఇచ్చిన దర్శకుల కాంబినేషన్ ను రిపీట్ చేస్తూ మహేష్ అందరి దర్శకులకు డార్లింగ్ హీరోగా మారాడు. ఒక్కడు లాంటి సూపర్ హిట్ ఇచ్చిన గుణశేఖర్ తో అర్జున్ సినిమాని చేసిన మహేష్ దూకుడు సినిమా తరువాత శ్రీను వైట్లకు ఆగడు సినిమా అవకాశం ఇచ్చాడు. ఇక శ్రీకాంత్ అడ్డాల విషయానికి వస్తే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో టాలీవుడ్ పాత్ బ్రేకింగ్ మూవీ తీసిన ఆయన బ్రహ్మత్సోవం సినిమా లాంటి డిజాస్టర్ చిత్రాన్ని మహేష్ కు అందించాడు.

మహేష్ ఇచ్చిన అవకాశాలను గుణశేఖర్, శ్రీను వైట్ల, శ్రీకాంత్ అడ్డాల సద్వినియోగం చేసుకోలేకపోయారు. దాంతో ఆ దర్శకులతో తిరిగి మహేష్ పని చేయడం కష్టమేనంటూ ఫిలిం వర్గాలు చెబుతున్నాయి. కానీ మహేష్ ఇచ్చిన అవకాశాన్ని అందుకొని కొరటాల శివ రెండు బ్లాక్ బస్టర్ విజయాలను ఇచ్చాడు. శ్రీమంతుడు, భరత్ అనే నేను లాంటి సూపర్ హిట్స్ ఇచ్చిన కొరటాల శివతో త్వరలోనే మహేష్ మూడవ చిత్రం చేయనున్నాడు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైల్ నచ్చిన మహేష్ ఆయన దర్శకత్వంలో అతడు సినిమాని చేశాడు. ఆ తరువాత ఖలేజా సినిమాలో కూడా నటించాడు. ఖలేజా కమర్షియల్ గా నిరాశపరిచినా మహేష్ లోని కొత్త డైమెన్షన్ ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. దీంతో త్రివిక్రమ్ తో మహేష్ తన తరువాతి చిత్రాన్ని చేస్తున్నాడు. రాజమౌళి, సురేందర్ రెడ్డిలతో కూడా సినిమాలు చేసేందుకు ఓకే చెప్పిన మహెష్ టాప్ దర్శకుడు వీవీ వినాయక్ తో అసలు సినిమా చేయకూడదని నిర్ణయం తీసుకున్నారట. సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ యంగ్ హీరోలు ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లకు సూపర్ హిట్స్ ఇచ్చిన వినాయక్ టాలీవుడ్ లో స్టార్ దర్శకుడిగా ఓ వెలుగు వెలిగారు.

ఆ సమయంలోనే ఆయన మహేష్ తో సినిమా చేసేందుకు కొన్ని కథలు వినిపించారట. ఆ కథలు మహేష్ కు నచ్చకపోవడంతో సెట్స్ మీదకు వెళ్లలేదు. దీంతో ఇప్పటివరకు ఆ కాంబినేషన్ లో సినిమా రాలేదు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో వినాయక్ మాట్లాడుతూ తన కథతో మహేష్ ను ఒప్పించలేకపోయానని త్వరలోనే మహేష్ కు మంచి కథని వినిపిస్తానని చెప్పాడు. దీంతో వీరి కాంబినేషన్ లో సినిమా రావడం ఖాయమని అభిమానులు ఫిక్స్ అయ్యారు. కానీ ఫిలిం వర్గాలలో జరుగుతున్న ప్రచారం మేరకు మహేష్ ఎప్పటికీ వినాయక్ కు డేట్స్ కాదు కదా అపాయింట్మెంట్ కూడా ఇవ్వరట. తాను చెప్పిన కథలను వరుసగా మహేష్ నో చెబుతూ రావడంతో వినాయక్ తన అసహనాన్ని ఇండస్ట్రీ వ్యక్తులతో పంచుకున్నాడట. ఆ వ్యక్తులు ఆ విషయాన్ని మహేష్ కు చెప్పడంతో జన్మలో వినాయక్ తో సినిమా చేయకూడదని నిర్ణయం తీసుకున్నారని సినీ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఇక ఆ తరువాత వినాయక్ వరుస ప్లాప్స్ తో ఫేడ్ అవుట్ అయ్యారు. ఆ తరువాత కూడా వినాయక్ ఎన్ని సార్లు ట్రై చేసినా మహేష్ కథ వినేందుకు కూడా ఇష్టపడలేదని సినీ పండితులు చెబుతున్నారు. మొత్తానికి మహేష్ తో క్లాష్ వినాయక్ కెరీర్ డౌన్ కు కారణమైందనే టాక్ ఇండస్ట్రీలో నడుస్తోంది.

మొత్తానికి అది మ్యాటర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *