యంగ్ హీరో నిఖిల్ – చందూ మొండేటి కాంబినేషన్లో రూపొందిన ‘కార్తికేయ 2’ ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అద్భుత వైద్య రహస్యాలను పొందుపరిచి ఒక రహస్య ప్రాంతంలో భద్రపరిచిన శ్రీకృష్ణుడి కడియాన్ని చేజిక్కించుకోవాలని కొందరు దుర్మాగులు ప్రయత్నిస్తుంటే.. తన ప్రమేయం లేకుండా కథానాయకుడు ఈ ఛట్రంలోకి వచ్చి దానిని ఎలా కాపాడాడు అనే పాయింట్ తో ఈ సినిమా తెరకెక్కింది. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ సినిమా విడుదలైన ప్రతి ప్రాంతంలోను సక్సెస్ టాక్ ను సొంతం చేసుకుంది.

తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ ఇండియాలో కూడా ఈ సినిమా జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు. కృష్ణుడి తత్వంతో పాటు ద్వారక చుట్టూ కథ నడవడం, అనుపమ్ ఖేర్ లాంటి నటుడు నటించడంతో ఈ సినిమా కలెక్షన్స్ రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. మొదటి రోజు కేవలం 7 లక్షలు మాత్రమే వసూల్ చేసిన ఈ సినిమా రెండవ రోజు 28 లక్షలు మూడవ రోజు 1.04 కోట్లు నాలుగవ రోజు 1.22 కోట్లు ఐదవ రోజు 1.28 కోట్లు ఆరవ రోజు 1.32 కోట్లు వసూల్ చేసింది. ఈ సినిమా నార్త్ ఇండియాలో 5.5 కోట్లకు పైగా వసూల్ చేయడం విశేషం.నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి. ఇది శ్రీకృష్ణుడి చుట్టూ తిరిగే కథ కావడం వలన ఈ సినిమా వసూళ్లు ఒక రేంజ్ లో పెరగవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హిందీలో ఈ సినిమా 2000కు పైగా స్క్రీన్స్ లో ప్రదర్శితం అవుతుండటం విశేషం.

Nizam: 5.75Cr
Ceeded: 2.40Cr
UA: 2.05Cr
East: 1.30Cr
West: 90L
Guntur: 1.43Cr
Krishna: 1.12Cr
Nellore: 52L
AP-TG Total:- 16.32CR
KA+ROI – 1.23Cr
OS – 2.75Cr
North India – 2.75Cr
Total World Wide:- 22.70CR(40.75CR~ Gross)

ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాదించేందుకు 13 కోట్లకు పైగా వసూల్ చేయవలసి ఉంది. కేవలం 6 రోజుల్లోనే ఈ సినిమా 22 కోట్లకు పైగా వసూల్ చేసి పంపిణీదారులకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *