ప్రేమకథా చిత్రాల స్పెషలిస్టు హను రాఘవపూడి చాలా గ్యాప్ తరువాత తీసిన చిత్రం ‘సీతా రామం’. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ – మృణాల్ ఠాకూర్ నాయకా నాయికలుగా నటించగా, రష్మిక .. ప్రకాశ్ రాజ్ .. సుమంత్ .. వెన్నెల కిశోర్ .. మురళీశర్మ .. తరుణ్ భాస్కర్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ట్రైలర్, పాటలతో భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓ వైపు ఉగ్రవాదం, మరో వైపు ప్రేమ సన్నివేశాలను బ్యాలన్స్ చేస్తూ హను ఈ సినిమాని చక్కగా తెరకెక్కించాడు.

దాంతో ఈ సినిమా మొదటి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. కథ పరంగా చూసుకుంటే ఇది ప్రేమకథాకావ్యమే .కానీ విజువల్స్ పరంగా చూసుకుంటే దృశ్య కావ్యంగా ఉంది. వినోద్ తన కెమెరా పనితనంతో మెరుపులు మెరిపించాడు. పాత తరం కథతో
ఈ తరం ప్రేక్షకులను కూర్చోబెట్టడం .. కమర్షియల్ గా మెప్పించడం హనుకే చెల్లింది. ఈ సినిమాకు 17 కోట్ల బిజినెస్ జరగగా ఇప్పటివరకు సీతా రామం వరల్డ్ వైడ్ గా 12 రోజులకు 27.61 కోట్ల షేర్ 54 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసింది. పంపిణీదారులకు ఈ చిత్రం 10 కోట్లకు పైగా లాభాలు తీసుకువచ్చింది. ఈ సినిమాతో దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యాడు.

తెలుగులో డైరెక్ట్ సినిమా చేయాలని ఉందంటూ దుల్కర్ చాలా సందర్భాల్లో చెప్పాడు. అనుకున్నట్టుగానే ‘ సీతా రామం’ సినిమాలో హీరోగా చేశాడు. తెలుగులో ముందుగా ఈ సినిమా కోసం నానీని అడిగారట. అయితే వేరే ప్రాజెక్టులు లైన్లో ఉండటం వలన నాని ఈ ప్రాజెక్టు చేయలేనని చెప్పాడట. ఆ తరువాత ఈ కథ రామ్ కి వెళ్లిందినీ, అయితే, మాస్ కథలపై మనసుపడిన రామ్ ఈ కథ పట్ల అంతగా ఆసక్తిని చూపించలేదని అంటున్నారు. దాంతో ఆ అవకాశం దుల్కర్ కు వెళ్లిందట. కథ నచ్చడంతో దుల్కర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం .. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడం జరిగిపోయాయని చెబుతున్నారు. నాని, రామ్ చేయలేమని చెప్పిన కథ, దుల్కర్ కి హిట్ ఇచ్చిందనే టాక్ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. హిట్ సినిమాని మిస్ చేసుకున్న నాని, రామ్ ఇప్పుడు బాధ పడుతున్నారని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *