పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీలో నటించిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ చిత్రాలు ఘన విజయాన్ని సాధించాయి. ఈ చిత్రాల తరువాత ఆయన చేస్తున్న చిత్రం హరి హర వీరమల్లు. క్రియేటివ్ చిత్రాల దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రం కావడం, పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా, 50 శాతం చిత్రీకరణను జరుపుకుంది. ఆ సమయంలో కరోనా తీవ్రత కారణంగా షూటింగును ఆపేశారు.

ఆ తరువాత ‘భీమ్లా నాయక్’ ను పూర్తిచేయాలనే ఉద్దేశంతో పవన్ పూర్తి ఫోకస్ ఆ చిత్రంపై పెట్టారు. అలా ఈ సినిమా షూటింగు ఆలస్యమవుతూ వచ్చింది. ఈ సినిమా కథ 17వ శతాబ్దంలో నడుస్తుంది. అందువలన ఆ కాలంలోని నిర్మాణాలకు సంబంధించిన సెట్స్ కోసం టైం ఎక్కువగా పండుతోంది. దాంతో ఎప్పటికప్పుడు ఇక షూటింగు మొదలవుతుందని అభిమానులు అనుకుంటున్నారు. కానీ షూటింగు ఆలస్యమవుతూ వస్తోంది. ఇదే సమయంలో అక్టోబర్ 5 నుంచి ఏపీలో పవన్ పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. దాంతో ఈ సినిమా పూర్తవుతుందా? లేదా? అనే అనుమానాలు నెలకొన్నాయి.

ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబందించిన ఇంట్రస్టింగ్ అప్డేట్ ఒకటి బయటికి వచ్చింది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ను వచ్చే నెలలో మొదలెట్టనున్నట్టు చెబుతున్నారు. పవన్ తదితరులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తారట. కీలకమైన సన్నివేసాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరించనున్నారు. పవన్ పార్ట్ కు చెందిన సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో పూర్తి చేయనున్నారని తెలిసింది. ఇక ఈ చిత్రంలో ముందుగా జాక్వలిన్ ఫెర్నాండేజ్ ను తీసుకున్నారు. కానీ ఆమె ఈడీ కేసులో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. దాంతో ఆమె స్థానంలో నర్గిస్ ఫక్రిని తీసుకున్నారు. కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో, నిధి అగర్వాల్ కథానాయికగా అలరించనుంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *