ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది’ అనే సామెతను మనం వినే వింటాం. ఈ సామెత హీరో నితిన్ విషయంలో నూటికి నూరు పాళ్లు నిజమైంది. ఎందుకంటే దర్శకుడిపై కోపం నితీన్ నటించిన సినిమాపై పడింది. నితిన్ , కృతి శెట్టి, కేథరిన్ ప్రధాన పాత్రధారులుగా ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా రూపొందింది. ఈ నెల 12వ తేదీన థియేటర్లలో ఈ సినిమా దిగిపోనుంది. నితిన్ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చాడు. పాటలు, ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ పట్టేసి సినిమాపై అంచనాలను పెంచేశాయి. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాలకు ఎడిటింగ్ చేసిన రాజశేఖర్ రెడ్డి అలియాస్ ఎస్ ఏ శేఖర్ ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు.
ఈ సినిమా ప్రమోషన్స్ ఈవెంట్ లో దర్శకుడు చాలా తక్కువగా కనిపించాడు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఈ సినిమాని బ్యాన్ చేయాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దానికి కారణం దర్శకుడే అని టాక్ నడుస్తోంది. గతంలో వేరే సామాజిక వర్గాలపై ఎస్ ఏ శేఖర్ నెగటివ్ ట్వీట్ చేసాడంటూ #banmacharlaniyojakavargam అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. ఆ ట్వీట్స్ ఫేక్ అంటూ దర్శకుడు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. కానీ ఆ ప్రచారం మాత్రం జరుగుతూనే ఉండటం విశేషం. ఇక ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ మొత్తం నితిన్ అన్నీ తానే ముందుండి నడిపించాడు. దర్శకుడు రాజశేఖర్ రెడ్డిని తక్కువ మాట్లాడించి మొత్తం నితినే చూసుకున్నాడు.
నెగటివ్ ప్రచారంతో మాచర్ల నియోజకవర్గానికి థియేట్రికల్ బిజినెస్ జరగదని సినీ పండితులు భావించారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సినిమాకు ఓ రేంజ్ లో థియేట్రికల్ బిజినెస్ జరగడం విశేషం. ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా 21 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం విశేషం.
Nizam: 6Cr
Ceeded: 3Cr
Andhra: 10Cr
AP-TG Total:- 19CR
Ka+ROI: 1Cr
OS – 1.20Cr
Total WW: 21.20CR
ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 22 కోట్లకు పైగా వసూల్ చేయవలసి ఉంది. దర్శకుడిపై కోపం, సినిమాపై నెగటివ్ ప్రచారంతో మాచర్ల బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా? లేదా? తెలియాలంటే కొన్ని రోజులు ఆగకతప్పదు.