వరుసగా పరాజయాలతో నిరాశలో మునిగిపోయిన టాలీవుడ్ కు ‘సీతారామం’, ‘బింబిసార’ చిత్రాలు ప్రాణం పోశాయి. ఈ రెండు సినిమాలు ఆగష్టు 5న విడుదలై సూపర్ హిట్ టాక్ తో మంచి వసూళ్లను రాబట్టడం విశేషం. ప్రేక్షకులు సినిమా థియేటర్లకి రావడం లేదని బాధపడుతున్న ఇండస్ట్రీకి ఈ రెండు చిత్రాల విజయం ఎంతో ఊరటను, ఉత్సాహాన్ని ఇచ్చాయి. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తాయని ‘సీతారామం’, ‘బింబిసార’ చిత్రాలు నిరూపించాయి. వీకెండ్స్ లోనే కాదు వీక్ డేస్ లోనూ ఈ సినిమాలు మంచి వసూళ్లను రాబట్టాయి. మొహరం పండగ నేపథ్యంలో మంగళవారం హాలిడే కావడంతో ఈ సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు క్యూ కట్టారు.

దాంతో సీతారామం సినిమా ఐదు రోజుల్లో

Nizam: 3.10Cr
Ceeded: 83L
UA: 1.09Cr
East: 70L
West: 48L
Guntur: 56L
Krishna: 61L
Nellore: 29L
AP-TG Total:- 7.96CR
Ka+ROI – 78L
Other Languages – 2.15Cr
OS – 3.15Cr
Total World Wide – 14.21CR(27.50CR~ Gross) ఈ సినిమాకు 17 కోట్ల బిజినెస్ జరుగగా 5 రోజులకు 14 కోట్లకు పైగా వసూల్ చేసిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా 2.80 కోట్లు వసూల్ చేయవలసి ఉంది.

ఇక బింబిసార విషయానికి వస్తే మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం పంపిణీదారులకు భారీ లాభాలు తెచ్చిపెడుతోంది.

Nizam: 6.75Cr
Ceeded: 3.98Cr
UA: 2.61Cr
East: 1.16Cr
West: 84L
Guntur: 1.42Cr
Krishna: 1.00Cr
Nellore: 56L
AP-TG Total:- 18.70CR
Ka+ROI: 1.25Cr
OS – 1.52Cr
Total World Wide: 22.85 కోట్ల షేర్ 34 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసింది. 16 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా ఇప్పటికే 6 కోట్లకు పైగా లాభాలు తెచ్చిపెట్టడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *