రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘లైగర్’. ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. విజయ్ సరసన బాలీవుడ్ యువ నటి అనన్యా పాండే హీరోయిన్ గా నటించింది. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఓ కీలక పాత్ర పోషించారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్, పాటలు యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతుంది. అదే సమయంలో చిత్ర యూనిట్ వివిధ ఈవెంట్లలో పాల్గొంటూ ‘లైగర్’ను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది.
ఇందులో భాగంగా ‘కాఫీ విత్ కరణ్’ షోలో పాల్గొన్న విజయ్, అనన్య తాజాగా ముంబైలో ఈవెంట్స్ లో జాయిన్ అయ్యారు. ఆ ఈవెంట్ లో విజయ్ ను చూసేందుకు జనం పోటెత్తారు. ఆ ఈవెంట్ కు వచ్చిన జనాన్ని చూసి బాలీవుడ్ మీడియా నివ్వెరపోయింది. టాలీవుడ్ హీరోకు ఇంత క్రేజ్ నా అని వారు ఆశ్చర్యపోయారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా కోసం పాన్ ఇండియా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబందించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమాని చూసిన సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. లైగర్ చిత్రం దాదాపు 2 గంటల 20 నిమిషాల రన్ టైమ్ ఉన్నట్లు తెలుస్తోంది.
రషెస్ సమయంలో ఉన్న లెంగ్త్ ను ట్రిమ్ చేసినట్లు తెలిసింది. పూరి తన స్టైల్ టేకింగ్ తో ఈ సినిమాని పరుగులు పెట్టించినట్లు చెబుతున్నారు. యాక్షన్ సీక్వెన్స్, పాటలతోపాటు విజయ్ డాన్స్ లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోనున్నాయంటున్నారు. బాక్సర్‌గా విజయ్ అదరగొట్టాడని, అతడి మాస్ లుక్కు ఫ్యాన్స్ ఫిదా కాకుండ ఉండలేరట. ఎమోషనల్ సన్నివేశాలు అక్కడ అక్కడ బాగా వర్క్ అవుట్ అయ్యాయట. విజయ్ తల్లిగా రమ్యకృష్ణ పాత్ర స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుందట. మైక్ టైసన్ ట్రాక్ కూడా చాలా ఇంట్రస్టింగ్ గా ఉండనుందట. చివర్లో దేశభక్తిని మిక్స్ చేస్తూ సాగే క్లైమాక్స్ సన్నివేశాలు సూపర్బ్ గా ఉన్నాయట. టోటల్ గా ఈ సినిమా చూసిన సెన్సార్ బోర్డు వారు లైగర్ టీంను ప్రశంసించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని కరణ్‌జొహార్, చార్మీతో కలిసి పూరి స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ మూవీతో విజయ్ పాన్ ఇండియా ఆడియన్స్ ను ఎంతమేర మెప్పిస్తాడనేది తెలియాలంటే ఈ నెల 25 వరకు ఆగవలసిందే.