ఆర్ఆర్ఆర్ చిత్రంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా తరువాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమాని చేస్తున్నాడు. ఎన్టీఆర్ 30 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం ఎప్పుడు స్టార్ట్ అవుతుందా? అని అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు సుదీర్ఘ నిరీక్షణ తప్పేలా లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ ప్రస్తుతం బరువు తగ్గే పనిలో ఉన్నారు. తన మేక్ ఓవర్ లో మార్పులు చేసిన తరువాతే ఎన్టీఆర్ ఈ సినిమా సెట్స్ లో జాయిన్ కానున్నాడు.
ఎలాగూ ఆలస్యం అయిందనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని వినాయక చవితి ఆగష్టు 31న స్టార్ట్ చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది.
ఎన్టీఆర్ పుట్టిన రోజున విడుదల చేసిన పోస్టర్, మోషన్ టీజర్ సూపర్ రెస్పాన్స్ పట్టేసి షూటింగ్ స్టార్ట్ కాకముందే సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను తీసుకున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ ఎంతో పాప్యులారిటీని సొంతం చేసుకున్నారు. వరుస సినిమాలతో బాలీవుడ్ లో ఆమె దూసుకుపోతోంది. మరోవైపు ఎన్టీఆర్ 30 కోసం జాన్వీ కపూర్ ను ఎంపిక చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై తాజాగా జాన్వీ కపూర్ స్పందించింది.
తనకు తెలుగులో లేదా ఏదైనా సౌత్ సినిమాలో చేయాలనే కోరిక ఉందని చెప్పింది. జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం వచ్చిందనే రూమర్ నిజమైతే తనంత అదృష్టవంతురాలు ఎవరూ ఉండరని… అయితే దురదృష్టవశాత్తు తనకు అలాంటి ఆఫర్ రాలేదని తెలిపింది. జూనియర్ ఎన్టీఆర్ తో నటించే అవకాశం రావడమంటే మామూలు విషయం కాదని చెప్పింది. తారక్ తో అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని తెలిపింది. జాన్వీ కపూర్ క్లారిటీ ఇవ్వడంతో హీరోయిన్ అవకాశం ఎవరికీ వెళ్ళిందంటూ ఫిలిం వర్గాలలో చర్చ జరుగుతోంది. దీనిపై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగకతప్పదు. స్టూడెంట్ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే ఎన్టీఆర్ తన 31వ చిత్రాన్ని కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్సకత్వంలో చేయనున్నాడు.