నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ఆయన సొంత బ్యానర్లో ‘బింబిసార’ నిర్మితమైంది. కల్యాణ్ రామ్ కెరియర్లోనే అత్యధిక భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమా ఇది. గతంలో ‘ప్రేమలేఖ రాశా’ సినిమాలో హీరోగా నటించిన వశిష్ఠ ఈ సినిమాకి దర్శకుడు. విడుదల చేసిన పాటలు, ట్రైలర్ సూపర్ గా ఉండి సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా ఈ చిత్రానికి సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. కల్యాణ్ రామ్ తప్ప ఈ పాత్రను ఇంత గొప్పగా పోషించడం ఎవరివల్లా కాదని కితాబునిస్తూ, సినిమాపై అంచనాలు పెంచేలా ఎన్టీఆర్ మాట్లాడాడు.
ఇక నట సింహం బాలకృష్ణతోనూ ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఓ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. కానీ చెల్లలి మరణంతో బాలయ్య ఆ ఈవెంట్ లో పాల్గొనలేదు. ఒక రాజు మరో కాలం నుంచి ప్రస్తుత కాలానికి వస్తే జరిగే సంఘటనల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను థ్రిల్ కు గురి చేస్తుందని కళ్యాణ్ రామ్ థీమాగా ఉన్నాడు. మగధీర, బాహుబలి సోషియా ఫాంటసీ చిత్రాలని, తమది టైమ్ ట్రావెల్ మూవీ అని తెలిపిన దర్శకుడు ఆ రెండు చిత్రాలతో తమ చిత్రాన్ని పోల్చడం సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అయితే ఆ రెండు చిత్రాలకు ‘బింబిసార’ కథా నేపథ్యానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
టైమ్ ట్రావెల్ జానర్ లో వస్తున్న ఈ చిత్రం ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్ లో బిజినెస్ జరగడం విశేషం.
Nizam – 5Cr
Ceeded – 2Cr
Andhra – 6.50Cr
AP TG:- 13.50Cr
Ka+ROI – 1.1Cr
OS – 1Cr
Total WW:- 15.60Cr (Break Even – 16.20Cr~)
ఈ సినిమాకు 15.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే బ్రేక్ ఈవెన్ సాదించేందుకు 16 కోట్లకు పైగా వసూల్ చేయవలసి ఉంది. కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే హైయెస్ట్ బిజినెస్ వసూల్ చేసిన చిత్రంగా ‘బింబిసార’ నిలిచింది. మరి కళ్యాణ్ రామ్ కోరుకుంటున్న విజయాన్ని ఈ సినిమా అందిస్తుందా లేదా అనేది తెలియాంటే శుక్రవారం (ఆగష్టు 5) వరకు వెయిట్ చేయవలసిందే.