బెజ‌వాడ ఎంపీ కేశినేని నాని బ్యాంక్‌ల‌కు ఎగ‌నామం పెట్టే క్ర‌మంలో ఉచ్చులో చిక్కుకుంటున్న‌ట్టే క‌నిపిస్తోంది. కేశినేని అప్పుల భాగోతం బ‌య‌ట‌ప‌డింది. కోట్లాది రూపాయల అప్పులు బ్యాంక్ నుంచి తీసుకుని ఎంతకూ తిరిగి చెల్లించకపోవడంతో చేసేది లేక బ్యాంక్ అధికారులు డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ లో కేసు వేశారు. ఈ కేసు దాక తెచ్చుకోవ‌డం వెనుక కేశినేని వ్య‌వ‌హార శైలియే కార‌ణ‌మే చ‌ర్చ వినిపిస్తోంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కేశినేని కార్గో అండ్ క్యారియర్ ప్రైవెట్ లిమిటెడ్ అనే కంపెనీ పేరు మీద గ‌తంలో కోట్లాది రూపాయలు అప్పులు తీసుకున్నారు. అప్పులు తీసుకునేటప్పుడు అధికారం, పదవి అడ్డుపెట్టి బ్యాంక్ అధికారుల ముక్కుపిండి మరీ లోన్ తీసుకున్నారు ఈ ఎంపీ గారు. సీన్ క‌ట్ చేస్తే.. ఇప్పుడు తిరిగి అప్పు చెల్లించండి అంటూ ఇటీవ‌ల‌ బ్యాంక్ అధికారులు అడుగుతుంటే.. మొండిత‌నం చూపించ‌డ‌మే కాదు త‌న‌నే అడుగుతారా అంటూ వారిపై ఫైర్ అయ్యార‌ట‌. నేనేంటో మీకు తెలుసా.. నేనెవరో మీకు మతి ఉండే మాట్లాడుతున్నారా.. నాతో పెట్టుకుంటే మీ పరిస్దితి ఏమవుతుందో ఆలోచించుకోండి. టాటా బిర్లాకు అత్యంత ఆప్తుడినైన నన్ను మీరు అప్పు చెల్లించమంటారా.. అంటూ రెచ్చిపోయారంట. దీంతో బ్యాంక్ అధికారులు నోటీసులు పంపించే ప్ర‌య‌త్నం చేశార‌ట‌. ఎన్నిసార్లు నోటీసులు పంపించినా రిసీవ్ చేసుకోలేదంట ఈ ఎంపీగారు. దీంతో యూనియన్ బ్యాంక్ అధికారులు.. ఎంపీగారి ద‌గ్గ‌ర చేసేదేం లేక అప్పు వసూలు చేసేందుకు డెబిట్ రికవరీ ట్రిబ్యునల్‌లో కేసు వేశార‌ట‌. కేశినేని అప్పుల బాగోతంపై స్పందించిన ట్రిబ్యునల్ కేశినేని కార్గో అండ్ క్యారియర్, కేశినేని శ్రీనివాసరరావు పేరుతో పత్రికా ప్రకటన విడుదల చేసింది. జూలై 11వ తేదిన ఉదయం 10.30నిమిషాలకు డెబిట్ రికవరీ ట్రిబ్యూనల్ ముందు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.

త‌మ‌కు న్యాయం చేయాంటూ ట్రిబ్యునల్ ను ఆశ్ర‌యించారంటే మన కేశినేని నానిగారి అప్పులు, ఆ తరువాత బెదిరింపుల బాగోతం ఏ స్దాయిలో ఉందో అర్దం చేసుకోవచ్చు. ఈ ఘ‌ట‌న పొలిటిక‌ల్ ప‌రంగా కేశినేనికి డ్యామేజ్ జ‌రుగుతుంద‌నే టాక్ బెజవాడలో గ‌ట్టిగా వినిపిస్తోంది. టాటా-బిర్లాలు త‌న‌కు దగ్గరే.. అని బడాయిలు చెప్పే ఈ పెద్దమనిషి ఇప్పుడు పీకల్లోతు అప్పుల్లో ఉన్నారని బెజవాడలోని కేశినేని ఆంతరంగికులే చర్చించుకుంటున్నారు. ఇటువంటి కేసులు మాఫీ చేయించుకోవడానికి ఎంపీ పదవిని వాడుకుంటున్నారని బెజవాడలో వినిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *