విజయ్ దేవరకొండ – పూరీ ల క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా లైగర్. రీసంట్ గా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ తో ఈ సినిమా ట్రెండింగ్ లో నిలిచింది. అంతేకాదు, విజయ్ లుక్స్, భారీ కటౌట్ అన్నీ కూడా సోషల్ మీడియాలో సందడి చేస్తునే ఉన్నాయి. నిజానికి విజయ్ దేవరకొండ సినిమా రిలీజ్ అవుతుందంటేనే యూత్ ట్రోల్స్ స్టార్ట్ చేస్తారు. సోషల్ మీడియాలో కొంతమంది పనిగట్టుకుని మరీ ట్రోలింగ్స్ చేస్తునే ఉంటారు. ఈ నేపథ్యంలో ప్యాన్ ఇండియా రేంజ్ లో వస్తున్న లైగర్ సినిమా గురించి ఆసక్తికరమైన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆగస్టు 25న ఈ సినిమా విడుదల కానుంది. దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ షురూ చేశారు. బాలీవుడ్ లో కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఈ సినిమాను రిలీజ్ చేస్తుండడంతో అక్కడ బజ్ పెరిగింది. ఈ సినిమాలో చాలా సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. వాటిని థియేటర్లో చూసినప్పుడు ఫ్యాన్స్ కి పూనకాలే అని అంటున్నారు. వాటిలో ఓ ఫైట్ సీన్ ఉందట.
దాదాపు 14 మంది అమ్మాయిలతో విజయ్ దేవరకొండ యాక్షన్ సీన్ ప్లాన్ చేశారట డైరెక్టర్ పూరీ అండ్ టీమ్. ఈ ఫైట్ సినిమాకే హైలెట్ అని చెప్తున్నారు. ఆ 14 మంది అమ్మాయిలు మార్షల్ ఆర్ట్స్ లో నిపుణులని తెలుస్తోంది. విదేశాల నుంచి వారిని తీసుకొచ్చాడట పూరి. ఈ ఒక్క ఫైట్ కోసం భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి వచ్చిందట. ప్రీ క్లైమాక్స్ కి ముందు వచ్చే ఈ సీన్ మంచి బ్లాస్ట్ అవుతుందని చెబుతున్నారు.
ఇక ఈ సినిమాలో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ట్రైలర్ లో విలన్ లుక్ లో కనిపించిన మైక్ టైసన్ సినిమాలో ఎలా కనిపించబోతున్నాడు అనేది ఆసక్తికరం. ఇక వీరిద్దరి మద్యలో వచ్చే సీన్స్ కూడా ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తాయని అంటున్నారు. కేవలం ఫైట్స్ మాత్రమే కాకుండా సినిమాలో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ చాలానే ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. లైగర్ కి వస్తున్న బజ్ చూస్తే బాక్సాఫీస్ షేక్ అయ్యేలాగానే కనిపిస్తోంది. అంతేకాదు, ఫస్ట్ డే విజయ్ కి మంచి ఓపెనింగ్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా 100 నుంచీ 200కోట్ల మార్కెట్ ని కొల్లగొడుతుందని ట్రేడ్ నిపుణులు అంచనాలు వేస్తున్నారు. మరి ఆ రేంజ్ లో కలక్షన్స్ వస్తే మాత్రం విజయ్ దేవరకొండకి ఇంక తిరుగుండదు. బాలీవుడ్ లో సినిమా కనెక్ట్ అయ్యి, హిట్ కొడితే మార్కెట్ రెట్టింపు అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.