సీటీమార్ తో మంచి సక్సెస్ అందుకున్న హీరో గోపీచంద్ మరోసారి తన మార్క్ చాటేందుకు పక్కా కమర్షియల్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫ్యామీలీ ఎంటర్ టైన్మెంట్స్ తీయడంలో ఆరితేరిన మారుతి మరి ఈ సినిమాతో మెప్పించాడా లేదా అనేది తెలియాలంటే మనం రివ్యూలోకి వెళ్లాల్సిందే… అసలు ఈ సినిమా కథేంటి

లక్కీ అంటే గోపీచంద్ లాయర్. లక్కీ తండ్రి సూర్యనారాయణ అంటే సత్యరాజ్ ఒక కిరాణా షాప్ నిడిపిస్తుంటాడు. తండ్రి ముందు మంచి వాడిలా నటిస్తూనే లాయర్ గా క్రిమినల్స్ దగ్గర డబ్బులు తీసుకుని వారిని కాపాడుతూ ఉంటాడు. ఈ విషయంలో వివేక్ అంటే రావ్ రమేష్ కేసు విషయంలో డబ్బులు తీసుకుంటూ తండ్రి సూర్యనారాయణ కంట పడతాడు. దీంతో లక్కీ చేసే పనులు సూర్యనారాయణకి తెలుస్తాయి. ఆ తర్వాత ఏం జరిగింది. అసలు సూర్యనారాయణకి వివేక్ కి సంబంధం ఏంటి ? వృత్తిరీత్యా లాయర్ అయిన సూర్యనారాయణ ఎందుకు కిరాణా షాప్ పెట్టుకున్నాడు. ఈ కథలో రాశీఖన్నా ఎవరు అనేది తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్.. ++

సినిమాని వినోదభరితంగా తీయడంలో మారుతి తన మార్క్ ని వేశాడు. అదే సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యింది. హీరో ఎలివేషన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ సినిమాకి ప్లస్ పాయింట్స్. అలాగే, సాంగ్స్, రాశీ గ్లామర్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ప్లస్ అయ్యాయి. ప్రొడక్షన్ వాల్యూస్, ఎడిటింగ్ కూడా బాగుంది. సినిమాలో కొన్ని డైలాగ్స్ సూపర్బ్ గా ఉన్నాయి.

సినిమాలో మైనస్ పాయింట్స్. —


హీరో ఎలివేషన్స్ షాట్స్ పై ఎక్కువ ఫోకస్ పెట్టారా అనిపిస్తుంది. కథ రొటీన్ గా ఉన్నప్పుడు స్క్రీన్ ప్లే బలంగా రాసుకుని ఉండాల్సింది. అది మిస్ అయ్యిందనిపిస్తుంది. అలాగే, ఫస్ట్ నుంచీ స్టోరీ ఎలా ఉండబోతోందనేది ప్రేక్షకులు ముందుగానే ఊహించేలా ఉంటుంది. కొద్దిగా సీన్స్ కూడా ల్యాగ్ అనిపిస్తాయి.

ఓవర్ ఆల్ గా చెప్పాలంటే గోపీచంద్ పక్కా కమర్షియల్ అంటూ రొటీన్ సినిమానే చేసినట్లుగా అనిపిస్తుంది. వీకండ్ ఖాళీగా ఉంటే ఒక్కసారి చూడచ్చు.

రేటింగ్ 2 అవుట్ ఆఫ్ 5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *