తెలుగు ప్రేక్షకులు అందరూ భీమ్లానాయక్ ఫీవర్ లో ఉంటే, వలీమై అంటూ అజిత్ తెలుగు ప్రేక్షకులని పలకరించాడు. భీమ్లానాయక్ టిక్కెట్స్ దొరకని వాళ్లు, ఇంకా సినిమా షోకి టైమ్ ఉన్నవాళ్లు ఒక లుక్కేద్దామని వలీమై ని పలకరించారు కూడా. ఇందుకో హీరో కార్తికేయ విలన్ గా నటించడంతో తెలుసు ప్రేక్షకులకి ఈ సినిమా చూడాలన్న ఆసక్తిపెరిగింది. మరి చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చిన అజిత్ తమిళ డబ్బింగ్ సినిమా ఎలా ఉందో తెలియాలంటే మనం రివ్యులోకి వెళ్లాల్సిందే..
అసలు ఈ వలీమై సినిమా కథేంటి..?
సైతన్ స్లేవ్స్ అంటూ ఒక ఆన్ లైన్ మాఫియా క్రైమ్ బిజినెస్ ని నడిస్తుంటుడు నరేన్ అంటే కార్తీకేయ. యూత్ ని టార్గెట్ చేసి వాళ్లని మత్తుకి బానిసలని చేసి తన క్రైమ్ బిజినెస్ లో వాడుకుంటు ఉంటాడు. టెక్నాలజీని ఉపయోగిస్తూ పోలీసుల నుంచీ తప్పించుకుని తిరుగుతుంటాడు. ఇదే టైమ్ లో వైజాక్ ప్రాంతానికి అసిస్టెంట్ కమీషనర్ గా వస్తాడు అర్జున్ అంటే హీరో అజిత్. నేరాలని అరికట్టేందుకు స్పెషల్ టీమ్ ని సిద్ధం చేసుకుంటాడు. నరేన్ కి, అర్జున్ కి ఎలాంటి పోరాటం జరిగింది. వీరిద్దరిలో ఎవరు గెలిచారు అనేది తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే..
సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటి
ముందుగా చెప్పుకోవాల్సింది హీరో అజిత్ స్టైల్. సినిమాకే హైలెట్. సైతాన్ స్లేవ్స్ ని పట్టుకోవడంలో తనదైన స్టైల్ లో రంగంలోకి దిగుతాడు. ఇక్కడ వచ్చే బిల్డప్ షాట్స్, అజిత్ లుక్స్ సినిమాకే హైలెట్ గా నిలిచాయి.
అజిత్ బైక్ రేస్ సీన్స్ థియేటర్స్ లో విజిల్స్ వేయిస్తాయి. యాక్షన్స్ సీన్స్ చాలా ఈజీగా ఇరగదీశాడు. అజిత్ తో పాటుగా మిగిలిన ఆర్టిస్టులు కూడా తమ పాత్రలకి న్యాయం చేశారు. సినిమాలో అదే హైలెట్. అజిత్ కి కార్తీకేయకి వచ్చే బైక్ రేసింగ్ సీన్స్ హైలెట్. అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాని ఒక రేంజ్ లో నిలబెట్టింది. సెకండ్ హాఫ్ లో యాక్షన్ సీన్స్, ప్రీ క్లైమాక్స్ సీన్స్ సినిమాకి బలంగా మారాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, మేకింగ్ సినిమాకి ప్లస్పాయింట్స్.
మైనస్ పాయింట్స్..
తెలిసిన కథనే డైెరెక్టర్ మరోసారి తీశాడా అని అనిపిస్తుంది. అలాగే, అజిత్ రేంజ్ కి భారీ యాక్షన్ పెట్టనా కూడా కథనం స్లోగా ఉండేసరికి ప్రేక్షకుడికి కాస్త అసహనం కలుగుతుంది. కొత్తదనం లేకపోవడం, డ్యూరేషన్ ఎక్కువగా ఉండటం కూడా సినిమాకి కాస్త మైనస్ అనే చెప్పాలి. ఛేజింగ్ సీన్స్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కొద్దిగా కనెక్ట్ అవ్వలేరు. ఎటిడింగ్ కి కొంచెం పని చెప్పి ఉంటే బాగుండేది. డబ్బింగ్ వాల్యూస్ కూడా హై ఎండ్ లో కనిపించవు.
ఓవర్ ఆల్ గా చెప్పాలి అంటే అజిత్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చే సినిమా ఇది. ఖాళీగా ఉంటే వీకెండ్ వలీమైని ఒక లుక్కేయచ్చు.
రేటింగ్ 2.5 / 5