పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపుదిద్దుకున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. వాస్తవానికి ఈ సినిమా సంక్రాంతి సీజన్ లో రిలీజ్ కావాల్సి ఉన్నా, పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 25న విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఓమిక్రాన్ ఎఫెక్ట్ కారణంగా ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదల అవుతుందా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. ఫిబ్రవరి 15 నాటికి కరోనా పరిస్థితులు సర్దుకుంటాయని శాస్త్రవేత్తలు చెప్పడం టాలీవుడ్ కు పెద్ద ఊరట కలిగించింది. ఈ నేపథ్యంలో భీమ్లా నాయక్ చిత్రం
అనుకున్న సమయానికి విడుదల అవుతుందా అని ఆసక్తిగా పవన్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ నుంచి చిత్ర యూనిట్ కు స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు టాక్ నడుస్తోంది.

ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితులలో ఫిబ్రవరి 25న విడుదల చేయాలని సితార ఎంటర్టైన్మెంట్ సంస్థకు పవన్ గట్టిగానే చెప్పినట్లు తెలిసింది. ఇక ఈ సినిమాకి స్క్రీన్ ప్లే- సంభాషణలు అందించిన త్రివిక్రమ్ కూడా సినిమా విడుదలను ఆలస్యం చేయకుండా ఫిబ్రవరి 25న విడుదల చేయాలని సితార ఎంటర్టైన్మెంట్స్ కు చెప్పినట్లు టాక్ నడుస్తోంది. ఫిబ్రవరి 25న భీమ్లా విడుదల కాగానే పవన్ కళ్యాణ్ పీరియాడికల్ మూవీ హరిహర వీరమల్లు సినిమాలో జాయిన్ కానున్నాడు. ఇక త్రివిక్రమ్ అయితే #ssmb28ని సెట్స్ మీదకు తీసుకువెళ్లనున్నారు. పవన్, త్రివిక్రమ్ నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో చిత్ర యూనిట్ ఆ సన్నాహాలలో బిజీగా ఉంది. ఈ క్రమంలో, ఫిబ్రవరి 24న అమెరికా, కెనడా దేశాల్లో భీమ్లానాయక్ ప్రీమియర్ షోలు ప్రదర్శించేలా చిత్ర సంస్థ ప్లాన్ చేసింది.

అమెరికా, కెనడాల్లో ఈ చిత్రాన్ని ప్రైమ్ మీడియా సంస్థ భారీ రేంజ్ లో విడుదల చేస్తోంది.అంతే కాకుండా ఆస్ట్రేలియా, దుబాయి దేశాలలో కూడా ఈ సినిమాని భారీ రేంజ్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి రన్ టైంగా 2 గంటల 22 నిమిషాలని ఫిక్స్ చేశారు. తమన్ అందించిన పాటలు సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో రానా నెగటివ్ రోల్ పోషిస్తుండగా, పవన్ కు జంటగా నిత్యా మీనన్ నటించింది. సముద్రఖని, మురళీశర్మ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాని సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 25న భీమ్లా రావడం ఖాయం కావడంతో పవన్ అభిమానులు గురూజీకి థాంక్స్ చెబుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రం ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందనేది తెలియాలంటే ఫిబ్రవరి 25 వరకు ఆగవలసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *