ఒక్క టాలీవుడ్ లోనే కాదు, అన్ని భాషల్లోనూ పుష్ప ద రైజ్ ని తన రేంజ్ ని చూపించాడు. పుష్పరాజ్ తగ్గేదేలే అన్నట్లుగానే కలక్షన్స్ లో తగ్గేదేలే అంటూ బాక్సాఫీస్ ని షేక్ ఆడించాడు. సుకుమార్ తీసిన టేకింగ్, అల్లుఅర్జున్ మాస్ యాక్షన్ తో పాటుగా సినిమాలో ఎన్నో క్యారెక్టర్స్ హైలెట్ అయ్యాయి. ముఖ్యంగా ఫస్ట్ పార్ట్ లో భన్వర్ సింగ్ షెకావత్ తో జరిగిన గొడవతో క్లైమాక్స్ ని ముగించాడు డైరెక్టర్. ఇక వీరిద్దరి మధ్యలో పోరాట సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయి ? సరుకుని చెక్ పోస్ట్ లో దాటిస్తూ భన్వర్ సింగ్ ని ఎలా పుష్ప బోల్తా కొట్టించాడు అనేదానిపైన సెకండ్ పార్ట్ ఇంట్రస్టింగ్ గా ఉండబోతోందట. అంతేకాదు, దీనికి సంబంధించిన సెకండ్ పార్ట్ షూటింగ్ అతి త్వరలోనే స్టార్ట్ కాబోతోంది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచీ సెట్స్ పైకి తీస్కుని వెళ్లి, డిసెంబర్ నాటికి సినిమాని విడుదల చేయాలని చూస్తున్నారు.
ఇక సెకండ్ పార్ట్ ఎలా ఉండబోతోంది ? ఇందులో హైలెట్స్ ఏంటి అనేది డైరెక్టర్ సుకుమార్ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో పంచుకున్నాడు.
పుష్ప పార్ట్ 1 కంటే కూడా పార్ట్ 2లో ఎమోషన్స్ ఒక రేంజ్ లో ఉంటాయని, ఫ్యామిలీ డ్రామాతో పాటుగా, మంగళం శ్రీను, అతని భార్య పాత్రలకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని చెప్పాడు. అంతేకాదు, వాళ్లకి సెకండ్ పార్ట్ లో ఇంకాస్త స్కోప్ ఉంటుందట. తన బామ్మర్ధిని చంపినందుకు మంగళం శీను ఎలా పగ తీర్చుకున్నాడు అనేది ఇంట్రస్టింగ్ గా ఉంటుందని, మరోవైపు జాలిరెడ్డి కూడా గాయల నుంచీ కోలుకుని పుష్పకి ఎదురుతిరుగుతాడని అంటున్నారు. ఇంత పవర్ ఫుల్ క్యారెక్టర్ అయిన పుష్పరాజ్ వీళ్లని ఎలా ఎదుర్కున్నాడు అనేది సెకండ్ పార్ట్ లో హైలెట్ కాబోతోంది.
మరోవైపు రష్మిక మందన క్యారెక్టర్ కూడా చాలా హైలెట్ గా ఉండబోతోందట. పుష్ప చేసిన పనులు తెలిసిన రష్మిక తను ఎదురు తిరుగుతుందని, ఒకానొక దశలో చచ్చిపోయేందుకు సైతం సిద్ధపడుతుందని అంటున్నారు. మరి సెకండ్ పార్ట్ ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ తో పాటుగా, యావత్ సినీ లవర్స్ లో ఆసక్తిగా మారింది.