అక్కినేని నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బంగార్రాజు’. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. సూపర్ హిట్ చిత్రం సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాలో నాగ చైతన్య కీలకపాత్రలో నటిస్తున్నారు. విడుదల చేసిన పాటలు, టీజర్ సూపర్ రెస్పాన్స్ పట్టేసి సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ సినిమా ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాని చూసి మెచ్చుకున్న సెన్సార్ సభ్యులు ఈ సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. పాజిటివ్ టాక్ తో బాటు పెద్ద చిత్రాలు పోటీ లేకపోవడంతో ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాలలో 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.
కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాలలో 34 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం విశేషం. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.5 కోట్లు, ఓవర్సీస్ లో జరిగిన మరో 2.5 కోట్లకు కలుపుకుంటే ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా 39 కోట్ల బిజినెస్ జరిగింది. నాగార్జున సినిమాకి 39 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం ఇదే మొదటిసారి కావడంతో ట్రేడ్ వర్గాలతో బాటు సినీ వర్గాలు కూడా ఆశ్చర్యపోయాయి. ఈ సినిమాని నాగార్జున 32 కోట్ల బడ్జెట్ తో నిర్మించాడు. సో థియేట్రికల్ బిజినెస్ లోనే ఈ సినిమా సేఫ్ ప్రాజెక్ట్ అయిందని సినీ వర్గాలలో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో వారి ఆనందానికి బ్రేకులు వేస్తూ ఏపీ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూని విధించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి పూట కర్ఫ్యూని అమలు చేయనుంది.
థియేటర్లలో 50 శాతం మంది ప్రేక్షకులను మాత్రమే అనుమతిస్తూ సీటు మార్చి సీటుకు మాత్రమే అనుమతి ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో 50 శాతం అక్యుపెన్సీతోనే థియేటర్లు నడవనునుండటంతో బయ్యర్స్ లో ఆందోళన నెలకొంది. దీంతో తాము ఇచ్చిన అడ్వాన్సులో 6 కోట్లు వాపసు చేయాలంటూ బయ్యర్స్ నాగార్జునని అడుగుతున్నారనే టాక్ నడుస్తోంది. అడ్వాన్సు వాపసు చేసేందుకు ఇష్టపడని నాగ్ బయ్యర్స్ కు మినిమమ్ గ్యారంటీ కింద ఒప్పందం చేసుకున్నట్లు సినీ వర్గాలలో వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. ఈ ఒప్పందానికి బయ్యర్స్ కూడా ఓకే చెప్పడంతో ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కావడం ఖాయమైంది. ప్రీ రిలీజ్ బిజినెస్ 30 కోట్లు అనుకున్న ఈ సినిమాకు 4 కోట్లు అదనంగా 34 కోట్ల బిజినెస్ జరిగింది. కానీ పరిస్థితుల కారణంగా 28 కోట్లకు మాత్రమే ఫైనల్ అయిందని ఇండస్ట్రీ వర్గాలలో చర్చ జరుగుతోంది. మరి ఈ బంగార్రాజు సంక్రాంతికి విజేతగా నిలుస్తాడా? లేదా? అనేది జనవరి 14న తేలనుంది.