పట్టుమని ఆరు నెలలు కూడా కాలేదు.. అప్పుడే థర్డ్ వేవ్ భారత్ ని చుట్టుముడుతోంది. అందరూ డబుల్ డోస్ వ్యాక్సిన్స్ వేసుకున్నా కూడా కరోనా కల్లోలం సృష్టించేస్తోంది. కొత్త కేసులు లక్షదాటేశాయ్ అంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అంతేకాదు, 10రోజుల వ్యవధిలో కేసులు 10 రెట్లు పెరిగిపోయాయి. మూడో వేవ్ ప్రమాదం ఇప్పుడు అందర్నీ ఆందోళనకి గురి చేస్తోంది. కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కేసులు కూడా మూడు వేలు దాటిపోయాయి. నిజానికి రోజు రోజుకీ కోవిడ్ పరీక్షలు చేయించుకునే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోతోంది. అందులోనూ వ్యాక్సినేషన్ తీస్కున్నా, తీసుకోకపోయినా కూడా ఈ లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ చెప్తోంది.
ఇక మనం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలని ఒక్కసారి చూసినట్లయితే,
15 లక్షలకు పైగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న వారిలో ఒక లక్ష 17వేల మందికి పైగా కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. వైరస్ పెరుగుదలలో ఇది మొదటి అడుగు మాత్రమే అని చెప్తున్నారు. అంటే ఇంకా పరీక్షలు చేయించుకోని వారి సంఖ్య లక్షల్లో ఉందని కూడా అంటున్నారు. స్వల్ప లక్షణాలు ఉన్నవారు నిర్ధరణ పరీక్షలకి రావడం లేదని, వాళ్లు యధేఛ్చగా బయట తిరుగుతున్నారని అంటున్నారు. ఒక్క మహారాష్ట్రలోనే 36 వేలకి పైగా కేసులు బయటపడ్డాయి. ముంబైలో 20వేలకి పైగా ఉండటం అనేది ఇప్పుడు అందర్నీ మరోసారి భయపెడుతోంది. లాస్ట్ టైమ్ సెకండ్ వేవ్ వచ్చినపుడు కూడా ఇలాగే ఫస్ట్ ముంబైలోనే ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. ముంబై నుంచీ తెలంగాణాకి, ఆంధ్రాకి వచ్చిన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. దాంతో రెండో వేవ్ లో లాక్డౌన్ అనేది తప్పని సరి అయిపోయింది.
ఇక దేశ రాజధాని పరిస్థితులు చూసినట్లయితే, పాజిటివ్ రేట్ 15శాతం పెరిగింది. ఇక కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కూడా ముంబైని, డిల్లీని వణికిస్తోంది. కొత్తగా కేసులు బయటపడుతూనే ఉన్నాయి. మరోవైపు టీకాల పంపిణీ కూడా వేగవంతం చేశారు. అందర్నీ వ్యాక్సిన్ తీస్కునే విధంగా డ్రైవ్స్ స్టార్ట్ చేశారు. మూడో వేవ్ ముప్పు నుంచీ తప్పించుకునేందుకు నైట్ పూట కర్ఫ్యూలు , లాక్డౌన్ చేయాల్సిన పరిస్థితి రావచ్చని ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తెలంగాణాలో కూడా సంక్రాంతి తర్వాత పరిస్థితులని ఒక్కసారి చూసుకుని నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనా ప్రతి ఒక్కరూ ఇప్పుడు మూడోవేవ్ నుంచీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏంతో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *