నేచరల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాల్ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా శ్యామ్ సింగరాయ్. ట్రైలర్ లో నాని బెంగాలీ డైలాగ్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. మరి ఈ శ్యామ్ సింగరాయ్ థియేటర్స్ లో ప్రేక్షకులని మెప్పించాడా లేదా అనేది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే..
కథేంటి ?
వాసుదేవ్ అంటే నాని ఒక షార్ట్ ఫిలిం చేస్తాడు. ఈ టైమ్ లో కీర్తి అంటే కృతి శెట్టిని చూసి ప్రేమిస్తాడు. తననే హీరోయిన్ గా చేసేందుకు ఒప్పిస్తాడు. ఈ షార్ట్ ఫిలిం నేషనల్ రేంజ్ లో హిట్ అవుతుంది. దీంతో పోలీసులు వాసుదేవ్ ని అరెస్ట్ చేస్తారు. ఇంతకీ తనని ఎందుకు అరెస్ట్ చేశారయ్యా అంటే శ్యామ్ సింగరాయ్ అనే పుస్తకం నుంచీ స్టోరీని కాపీ కొట్టావని చెప్తారు. దీంతో వాసు అసలు శ్యామ్ సింగరాయ్ ఎవరు అనేదానిపైన కసరత్తు చేస్తాడు. శ్యామ్ సింగరాయ్ కథని నాని ఎందుకు కాపీ కొట్టాడు ? శ్యామ్ సింగరాయ్ కథలో రోజీ అంటే సాయిపల్లవి ఎవరు అనేది వెండితెరపై చూసి తీరాల్సిందే.
ప్లస్ పాయింట్స్ : +++
నాని వన్ మాన్ షోగా సినిమాని తన భుజాలకెత్తుకుని మోశాడు. రెండు పాత్రల్లో తనదైన స్టైల్లో నటించి మెప్పించాడు. ముఖ్యంగా శ్యామ్ సింగరాయ్ గెటప్ లో ఇరగదీశాడు. తన బాడీ లాంగ్వేజ్, యాక్షన్ అన్నింటిపైనా ప్రత్యేకమైన శ్రద్ధని చూపించాడు. ఇదే సినిమాని నిలబెట్టింది. కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో వచ్చే సీన్స్ , అక్కడ ఫోటోగ్రఫీ సినిమాకి ప్రాణం పోశాయి. సాయిపల్లవి డ్యాన్స్, గెటప్ కూడా ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ లో ఎమోషన్స్ సినిమాకి ప్లస్ పాయింట్స్.
మైనస్ పాయింట్స్ : —
ఫస్ట్ పార్ట్ కొద్దిగా స్లో నారేషన్ సినిమాకి మైనస్ అనే చెప్పాలి. 75 వ సంవత్సరంలో గొప్పగా రాసిన రైటర్ ఫోటోని ఎక్కడా చూపించలేదు, అతను ఎవరో కూడా తెలియదు అని డైలాగ్స్ తో చెప్పడం అనేది లాజిక్ కి అందదు. స్క్రీన్ ప్లే కొద్దిగా స్లోగా ఉండటం వల్ల మాస్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయనే చెప్పాలి. అలాగే, కొన్ని సరదా సన్నివేశాలు రాసుకునే స్కోప్ ఉన్నా కూడా డైరెక్టర్ మిస్ అయ్యాడు.
ఫైనల్ గా చెప్పాలంటే :
మరోసారి నాని మార్క్ ఎమోషనల్ ఫీల్ గుడ్ మూవీగా శ్యామ్ సింగరాయ్ నిలిచిపోతుంది. వీకండ్ ఖాళీగా ఉంటే ఖచ్చితంగా మన శ్యామ్ సింగరాయ్ ని చూడచ్చు. బోర్ అయితే కొట్టదు.
రేటింగ్ : 2.75 / 5