తెలుగు బుల్లితెరలో స్టార్ మా లో ప్రసారం అవుతున్న బిగ్‌బాస్ 5వ సీజన్ దాదాపు 19 కంటెస్టెంట్‌లతో ప్రారంభమైన ఈ కార్యక్రమం చివరికీ ఇవాళ విజేత ఎవరు అనే విషయం మరికాసేపట్లోనే తెలియనున్నది. ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున బిగ్‌బాస్ విజేత సన్నీ అని వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అనుకున్నట్టుగానే తాజాగా ప్రసారమవుతున్న ప్రోగ్రామ్‌లో సన్నీనే విజేత అని తెలుస్తోంది. ఇక అభిమానులు సైతం సన్నీ విన్నర్ అంటూ దాదాపు సెలబ్రేషన్లు కూడా చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా గత కొద్ది రోజుల నుంచి ఓటింగ్ విషయంలో సన్నీ మొదటిస్థానంలో ఉండి నేడు టైటిల్ గెలుచుకోబోతున్నారు.
బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లిన 19 మంది కంటెస్టెంట్‌లో షణ్ముఖ్ బస్వంత్ మొదట టైటిల్ రేసులో ఉన్నట్టు అందరూ భావించారు. అయితే ఏ విధమైనటువంటి అంచెనాలు లేకుండా ఉన్న సన్నీ ప్రస్తుతం టైటిల్ రేసులో నిలబడి గత కొన్ని వారాల నుంచి టాప్‌లో ఉన్నారు. ఇలా అంచెనాలు లేకుండా సన్నీ మొదటి స్థానంలో నిలబడి విన్నర్ అవ్వడానికి గల కారణాలు ఏమిటనే విషయానికొస్తే.. ఏ విషయమైనా నిర్మొహమాటంగా బయటపెడుతూ ప్రతి ఒక్క టాస్క్ లలో ఎంత స్ట్రాంగ్ ఫర్మార్మెన్స్ చేయడం తనకు ఓ ప్లస్ పాయింట్ అయింది.
అదేవిధంగా బిగ్‌బాస్ హౌస్ లో ప్రతీ ఒక్క టాస్క్ లో ప్రతీ ఒక్క కంటెస్టెంట్ సన్నీని టార్గెట్ చేస్తూ అతనిని బ్లేమ్ చేయడం వల్ల ప్రేక్షకులకు సన్నీపై ఎంతో పాజీటివిటీ పెరిగింది. దీంతో రోజు రోజుకు అతనికి అభిమానుల సంఖ్య కూడా పెరిగింది. అలాగే షణ్ముక్ సిరి వ్యవహార శైలి కూడా సన్నీకి ప్లస్ పాయంట్ అయిందని చెప్పవచ్చు. బయట ఎంతో మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్‌తో హౌస్‌లోకి వెళ్లిన షణ్ముక్ బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లగానే చేయడం వల్ల చివరికీ అతని అభిమానులు సైతం వారి వ్యవహార శైలి పై అసహనం వ్యక్తం చేసారు. దీంతో సన్నీపై పాజిటివ్ పెరగడంతో సన్నీకి ఓట్లు ఎక్కువగా పడ్డాయని చెప్పొచ్చు. సన్నీ ఉండడం అతను ఎంత బెస్ట్ ఫర్పార్మెన్స్ ఇచ్చినప్పటికీ అతడు నామినేషన్ లో ఉండడంతో అతనిని సేవ్ చేయడం కోసం రోజు రోజుకు అభిమానులు సంఖ్య పెరిగిపోయింది.
తాను చేయని తప్పు కారణంగా అతను ఎన్నో మాటలు పడి రెండు సార్లు జైలుకు వెళ్లారు. అలాగే గిల్టీ పడి రెండు సార్లు జైలుకు వెళ్లారు. అదేవిధంగా గిల్టి బోర్డు మెడలో వేసుకొని ఉన్న సమయంలో ఇతని ప్రతీ ఒక్క ప్రేక్షకుడికి సింపతి కలగడంతో అభిమానుల సంఖ్య పెరిగిందనే చెప్పాలి. ఇక ప్రతీ ఒక్క కంటెస్టెంట్‌తో ఇలాంటి గొడవలు ఎదుర్కొన్నప్పటికీ ఈయన మంత్రం తనదైన శైలిలో ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచడంతో దీంతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు. ముఖ్యంగా బిగ్‌బాస్ హౌస్‌లో ప్రియా ఉన్నన్నీ రోజులు సన్నీపై ఎక్కువగా నెగిటివ్ చూపిస్తూ తన తప్పు లేకుండా తనను హైలెట్ చేసారు. దీంతో రోజు రోజుకు సన్నీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.