కోదాడలో పైలట్ ప్రాజెక్ట్ గా ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్

కోదాడ / హైద‌రాబాద్:
ఎప్పుడూ అవే పాలిటిక్స్, కొత్తద‌న‌మేముంది? సొసైటీలో ఛేంజ్ కోరుకోవ‌ద్దా? ప్ర‌జ‌ల జీవితాలు మార‌డానికి ప్ర‌య‌త్నించొద్దా? ఎంత‌కాల‌మిలా? దీనికి స‌మాధానం దొరుకుతోంది. జలగం సుధీర్ ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ కొన‌సాగిస్తూ రాజ‌కీయాల్లో స‌రికొత్త పంథా వ‌హిస్తున్నారు.

అమెరికాలో చదువుకుని, ఉన్నత ఉద్యోగాలు చేసిన తెలంగాణ‌ మంత్రి కేటీఆర్ మదిలో ఎప్పటి నుండో ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ చేయాలన్న కోరిక ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత తెలంగాణ రాజకీయ ఏకీకరణ నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలో ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ ప్రజల వద్దకు తీసుకెళ్ల‌డంలో కొంత వెనుకపడ్డారు. అటు బిజెపి, ఇటు కాంగ్రెస్ నాయకులతో ప్రభుత్వపరంగా జరిగే అనేక సమావేశాల్లో కేటీఆర్ తప్పనిసరిగా ఈ ఇష్యూ బేస్డ్ అనే పదం తీసుకు వ‌స్తున్నారు. ఇటీవల సిరిసిల్లాలో జరిగిన కొన్ని కార్యక్రమాల్లో డబ్బులు ఇవ్వ‌ను, మందు పంచను అని చెపుతూ అభివృద్ధి చూసి మాత్రమే ఓటు వేయాలని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.

కేటీఆర్ సూచన తో 2015 -16 నుండి కోదాడ ప్రాంత సమస్యల మీద జలగం సుధీర్ ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ మీద ఒక పైలట్ ప్రాజెక్ట్ చేశారు. ఎమర్జెన్సి హాస్పిటల్, పోస్టాఫిస్ స్థలం రక్షణ, చెరువుల కబ్జాలపై పోరాటం, యువత ఉపాధికి డ్రై పోర్ట్ ప్రతిపాదనలు, ఒకట్రెండు సినిమా షూటింగ్ లకు స్టుడియో ప్రతిపాదనలు, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల ఆలోచనలు, మానసిక వికలాంగులకు కేంద్ర నిరామయా పాలసిలు, ప్రభుత్వ వైద్యశాలలో వసతుల కల్పన, మహిళ లకు మొబైల్ షీ టాయిలెట్ లు, రాష్ట్రవ్యాప్త టాయిలెట్ కార్పొరేషన్ కు ప్రతిపాదనలు, రిసేర్చ్, డెవలప్ మెంట్ సెంటర్లు, మిని లైబ్రరీలు, వాల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, హైటెక్ బస్టాండ్ ఆలోచనలు, టెంపుల్ టూరిజం కు విజ్ఞప్తులు, మొబైల్ ట్రామ సెంటర్, నేషనల్ యాక్సిడెంట్ పాలసి, 10 లక్షల యాక్సిడెంట్ కంపానిసేషన్, డిజిటల్ తరగుతులు ఇలా అనేక కార్యక్రమాలు కోదాడ నుండే శ్రీకారం చుట్టి వాటి మీద ఎప్పటికప్పుడు రిపోర్ట్, ప్రజాభిప్రాయం తీసుకున్న కేటీఆర్ పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ల‌గా మ‌రికొన్ని నియోజకవర్గాల్లో ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

విదేశాల్లో మాదిరిగా సాఫ్ట్ వేర్ రంగాన్ని పరుగులు పెట్టిస్తున్న కేటీఆర్ ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ తో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానం లో ఉండాలని ప‌దేళ్ల క్రిత‌మే ఆలోచన చేసి చాపకింద నీరులా ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి కోదాడ, ఉమ్మడి కరీంనగర్ నుండి సిరిసిల్లా, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా నుండి చెన్నూర్ / ఖానాపూర్ లను పైలట్ ప్రాజెక్ట్ లుగా ఎంపిక చేసుకొని సక్సెస్ అయ్యారు. చాపకింద నీరులా కోదాడలో ఇష్యూ బేస్డ్ రాజకీయం చేసిన జలగం సుధీర్ ప్రస్తుతం కోదాడ టికెట్ రేసులో ముందంజలో ఉన్నారు. భవిష్య‌త్ తరాలకు ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ లేదా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అందించాలన్న కోదాడ ప్రజల కోరిక తీరనుందా లేక ఎప్పటిలాగానే మూస రాజకీయాల్లో ఓటుకు నోటు గెలుస్తుందా అనేదే చూడాల్సిన అంశం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *