పుష్ప – 2 సినిమా డైరెక్టర్ సుకుమార్ లెక్కలు మారుస్తున్నాడు. తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేని విజయాన్ని సాధించిన పుష్ప సినిమా పార్ట్ 2 కోసం ఇప్పుడు మార్కెట్ రేంజ్ పెంచేశాడు. బాలీవుడ్ ని ఒక్కసారి షేక్ చేసిన ఈ సినిమా ఇప్పుడు పార్ట్ 2 కి రెడీ అయిపోతోంది. విరామం లేకుండా చేసిన షూటింగ్స్ లో మంచి అవుట్ పుట్ వచ్చిందని చిత్రూయనిట్ నుంచీ సమాచారం. ఇక కొంత పార్ట్ ని హైదరాబాద్ లో మరికొంత పార్ట్ ని హాలండ్ లో షూటింగ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కి ఆఫర్లు మీద ఆఫర్లు వస్తున్నాయట. ముఖ్యంగా డిజిటల్, ఓటీటి హక్కులు డబుల్ రేట్ కి ఇచ్చి మరీ కొనేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. పార్ట్ 1 కంటే కూడా డబుల్ బిజినెస్ జరిగేలాగ కనిపిస్తోంది. దీంతో పుష్ప 2 సినిమా ఎంత ప్రీరిలీజ్ బిజినెస్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
లెక్కల్లోకి వెళితే, పుష్ప పార్ట్ 1 భారీ విజయాన్ని సాధించింది. కానీ, కొన్ని ఏరియాల్లో అనుకున్న స్థాయి వ్యాపారం జరగలేదనేది వాస్తవం. ‘పుష్ప ది రైజ్’ కి అన్ని వెర్షన్ లు కలుపుకుని రూ.145.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కోసం 146 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.165.15 కోట్ల భారీ షేర్ ను రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం దాదాపుగా 20కోట్ల ఫ్రాఫిట్ లో ఉంది. అయితే, ఆంధ్రలో బయ్యర్స్ మాత్రం కొంతమంది నష్టపోయారనేది వాస్తవం. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అయితే, ఈ ఎఫెక్ట్ ఇప్పుడు పుష్ప 2పై ఏమాత్రం పడట్లేదు. అన్ని భాషల్లో, అన్ని ఏరియాల్లో కలుపుకుని ఈ సినిమా 300 నుంచీ 400 కోట్ల వరకూ బిజినెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడులో ఈ సినిమా ఎక్కువ బిజినెస్ అవుతోందట. దీనికి కారణం పుష్ప పార్ట్ 1 తనిళనాడులో 10కోట్ల వరకూ కలక్షన్స్ ని సాధించింది. అందుకే, ఇప్పుడు ఫ్యాన్సీ రేటుకి పార్ట్ 2 ని కొనేందుకు బయ్యర్స్ సిద్ధమైపోయారు. ఇక పుష్ప 2కి సంబంధించి ఇన్నికోట్లు వ్యాపారం జరిగితే ఖచ్చితంగా ఈసినిమా 500కోట్ల మార్కెట్ ని టచ్ చేయాలి. గ్రాస్ లో ఈమార్క్ సాధిస్తే నిలకడగా లాభాలు వస్తాయి. కానీ, ఫ్యాన్స్ మాత్రం పుష్ప 2 వెయ్యికోట్లు అంటూ రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు. ఈ యాష్ ట్యాగ్స్ నిట్రెండ్ చేస్తున్నారు. ట్విట్టర్లో కూడా పుష్ప 2 వెయ్యికోట్లు అంటూ డిస్కషన్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు పుష్ప కి వెయ్యికోట్లు కొల్లగొట్టే సీన్ ఉందా ? ట్రిబుల్ ఆర్ సినిమాకే అంత బిజినెస్ రాలేదని మరోవైపు చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఈ లెక్కలు అన్నీ చూసిన తర్వాత సుకుమార్ మాస్టార్ ఏం డిసైడ్ చేస్తారో ఏమో కానీ, పుష్ప 2 మాత్రం భారీగా బిజినెస్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక బ్యాక్ టు బ్యాక్ అల్లు అర్జున్ సినిమాలు ఖచ్చితంగా 100కోట్లు దాటిపోయే మార్కెట్ అవ్వడం పక్కాగానే కనిపిస్తోంది. ఆఫ్టర్ పుష్ప కూడా బన్నీ మార్కెట్ మాత్రం ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగానే కనిపిస్తోంది. మరోవైపు గీతాఆర్డ్స్ లో సినిమాలు చేస్తున్న అల్లుఅరవింద్ రీసంట్ గా అల్లుఅర్జున్ ని ఆకాశానికి ఎత్తేశాడు. అందరూ నన్ను అల్లుఅర్జున్ తండ్రి అంటున్నారంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. దీనివల్ల ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ గట్టి మార్కెట్ కొల్లగొట్టేలాగానే కనిపిస్తున్నాడు. అయితే, ప్రస్తుతం ఉన్న మార్కెట్ తో పోలిస్తే మాత్రం వెయ్యికోట్లు కాకపోయినా ఈ సినమా ఖచ్చితంగా 500కోట్ల మార్క్ ని అయితే టచ్ చేస్తుందనే టాక్ వినిపిస్తోంది. రీసంట్ గా వస్తున్న సినిమాలు ప్యాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయ్యి ట్రేడ్ పండితులు ఆశ్చర్యపోయేలా కలక్షన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నో అంచనాలు ఉన్న పుష్ప 2 సినిమా ఎంత కలక్ట్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *